రాబోయే ఒలింపిక్స్‌లో మీ మాటను నిజం చేస్తా! - all you need to know about india wrestler who won gold in hungary
close
Updated : 26/07/2021 18:23 IST

రాబోయే ఒలింపిక్స్‌లో మీ మాటను నిజం చేస్తా!

Photo: Twitter

‘మీరాబాయి తర్వాత మరో మెడల్‌ గెలిచేదెవరు ?’అని భారత క్రీడాభిమానులందరూ టోక్యో ఒలింపిక్స్‌ను కళ్లప్పగించి తిలకిస్తున్న వేళ... మరో ప్రపంచ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండా మురిసిపోయింది. బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్‌ ప్రియామలిక్‌ స్వర్ణపతకం సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

‘ఒలింపిక్‌ ఛాంపియన్‌’గా..!

టోక్యో ఒలింపిక్స్‌ మొదలైన రెండో రోజే రజత పతకం గెల్చుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది మణిపూర్‌ మణిపూస మీరాబాయి చాను. ఈ అద్భుతం ఆవిష్కృతమైన మరుసటి రోజే హంగరీ రాజధాని బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్‌ క్యాడెట్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెల్చుకుంది ప్రియామలిక్‌. అందుకేనేమో మిలింద్‌ సోమన్‌, ఇషాంత్‌ శర్మ, హనుమ విహారి భూమి పెడ్నేకర్‌ తదితర సెలబ్రిటీలతో పాటు చాలామంది నెటిజన్లు పొరబడ్డారు. ఆమెను కూడా ‘ఒలింపిక్‌ ఛాంపియన్‌’గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్‌ చేశారు. వీటిని చూసిన ప్రియ ‘నేను ఒలింపిక్‌ మెడల్‌ గెలిచానని చాలామంది అనుకున్నారు. సోషల్‌ మీడియాలో కూడా అలాగే పోస్టులు పెట్టారు. మీ ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. రాబోయే ఒలింపిక్స్ (2024 ఫ్రాన్స్‌ ఒలింపిక్స్‌)లో కచ్చితంగా మీ మాటలను నిజం చేస్తాను. దీని కోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతాను’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.

హరియాణా నుంచే!

భారతదేశంలో కుస్తీ పోటీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది హరియాణా. ఆ రాష్ట్రానికి చెందిన ‘ఫోగట్‌ సిస్టర్స్‌’తో పాటు సాక్షి మలిక్‌, సోనమ్‌ మలిక్‌, అన్షు మలిక్‌ ఇప్పటికే అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ప్రియామలిక్ ప్రపంచ క్యాడెట్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. 73 కిలోల ఫైనల్‌ మ్యాచ్‌లో ఆమె బెలారస్‌కు చెందిన సెనియా పటపోవిచ్‌ను చిత్తు చేసింది. జింద్‌ జిల్లాలోని నిదాని గ్రామంలో పుట్టి పెరిగింది ప్రియ. తండ్రి జై భగవాన్‌ 18 ఏళ్లపాటు ఇండియన్‌ ఆర్మీలో హవల్దార్‌గా సేవలందించి నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. కుస్తీ పోటీల్లో అనుభవం ఉన్న ఆయన కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడారు. ప్రియ బాబాయి కూడా ఆర్మీలో రెజ్లింగ్‌ కోచ్‌గా రాణిస్తున్నారు.

అలా వెలుగులోకి!

2019లో పుణె వేదికగా జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో బంగారు పతకం గెల్చుకుంది ప్రియ. గతేడాది దిల్లీలో జరిగిన నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లోనూ స్వర్ణంతో మెరిసింది. ఆ తర్వాత పాట్నా వేదికగా జరిగిన జాతీయ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ పసిడి పతకం గెల్చుకుంది.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో!

రెజ్లింగ్‌పై ప్రియకున్న మక్కువను గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను అన్ని రకాలుగా ప్రోత్సహించారు. చౌదరి భరత్‌ సింగ్‌ మెమోరియల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఆమెను చేర్పించి కుస్తీ పోటీల్లో శిక్షణ ఇప్పించారు. ముఖ్యంగా ఆర్మీ నుంచి రిటైరైన అనంతరం కూతురు లక్ష్యసాధనకే తన సమయాన్నంతా కేటాయించారు జై భగవాన్.

‘నా తండ్రి నాకు, నా సోదరుడికి కలిపి కుస్తీ పోటీల్లో శిక్షణ ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను కొన్ని కుస్తీ పోటీల్లో పాల్గొన్నాను. ఇక నా సోదరుడు ఆర్మీలో రెజ్లింగ్‌ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నేను ఉద్యోగ విరమణ పొందాను. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాం. పొలం పనులు చూసుకుంటూనే నా కుమార్తె శిక్షణకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అని ఆమె తండ్రి చెబుతున్నారు.

అన్షు అక్కే నాకు స్ఫూర్తి!

నిదాని గ్రామానికే చెందిన అన్షు మలిక్‌ ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలో అన్షునే తనకు ఆదర్శమంటోంది 12వ తరగతి చదువుతోన్న ప్రియ.

‘మా గ్రామానికి చెందిన అన్షు దీదీ (అక్క)నే నాకు ఆదర్శం. కుస్తీ పోటీల్లో ఆమె సాధించిన విజయాలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. ఆమెను చూసిన తర్వాతే స్పోర్ట్స్‌ స్కూల్‌లో నా పేరు నమోదు చేసుకున్నాను. ఇక తాత (పృథ్వీరాజ్‌), మా అమ్మానాన్నలు అందించిన ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను’ అంటోందీ యంగ్‌ సెన్సేషన్.

ప్రపంచ క్యాడెట్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసిన ప్రియపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తున్నారు.

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని