Soapstone Cookware : వీటిలో వండుకుంటే రుచి ఆరోగ్యం! - all you need to know about soapstone cookware in telugu
close
Published : 15/08/2021 09:28 IST

Soapstone Cookware : వీటిలో వండుకుంటే రుచి ఆరోగ్యం!

ట్రెండ్‌, ఫ్యాషన్‌ అంటూ మొన్నటిదాకా నాన్‌స్టిక్‌ వంట పాత్రల వెంట పడ్డ వారంతా ఇప్పుడు వింటేజ్‌ కుక్‌వేర్‌పై ఆసక్తి చూపుతున్నారు. వీటిలో వండుకుంటే ఓవైపు వంట రుచిని ఆస్వాదించచ్చు.. మరోవైపు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చనేది వారి ఆరాటం. ఈ క్రమంలోనే మట్టి, ఇనుప పాత్రలకు రోజురోజుకీ ఆదరణ పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి సోప్‌స్టోన్‌ కుక్‌వేర్‌ కూడా వచ్చి చేరింది. పేరు మోడ్రన్‌గా ఉన్నా.. ఇవి పాత కాలపు రాతి పాత్రలే..! కొత్తగా, ఈ కాలం వారి అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకొని మరీ మార్కెట్లో కొలువు తీరాయి. అయితే ఈ పాతకాలపు కుక్‌వేర్‌లో వంట చేసుకోవడం ఎంత సులభమో.. అంత రుచి, ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరైతే ఆలస్యమెందుకు? మనమూ ఈ సోప్‌స్టోన్‌ కుక్‌ వేర్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..

సోప్‌స్టోన్‌ అని ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకుంటున్నాం కానీ.. పాత కాలంలో రోళ్లు, తిరగలి.. వంటివన్నీ ఈ రాయితో తయారైనవే! అయితే ప్రస్తుతం ఈ రాయితో ప్యాన్స్‌, కడాయి, ఇతర వంట పాత్రలు.. వంటివన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ రాయి ఎన్నో ఖనిజాల మిళితమని, ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇక ఈ పాత్రల్లో వండుకొని తినడం వల్ల వీటిలోని పోషకాలు శరీరంలోకి చేరతాయని, తద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాల్ని పొందచ్చని సలహా ఇస్తున్నారు.

పదే పదే వేడి చేయక్కర్లేదు!

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వండిన పదార్థాల్ని పదే పదే వేడి చేయడం మనకు అలవాటే! దీనివల్ల ఆయా పదార్థాల్లోని పోషకాలు విచ్ఛిన్నమై చివరకు అది విషపూరితమవుతుందంటున్నారు నిపుణులు. అదే సోప్‌స్టోన్‌ కుక్‌వేర్‌లో వండిన పదార్థాల్ని పదే పదే వేడి చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ రాయి వేడెక్కడానికి కాస్త సమయం పట్టినా.. వేడెక్కాక మాత్రం అది చల్లబడడానికి కొన్ని గంటల సమయం పడుతుందట! అందుకే ఒకసారి వేడెక్కాక ఈ వంట పాత్రల్లో వంట త్వరగా పూర్తవుతుందని, ఇందులో వండిన పదార్థం దాదాపు మూడు నుంచి నాలుగ్గంటల దాకా వేడిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి పదే పదే వేడి చేయాల్సిన అవసరం రాదు.

ఆ లోపాన్ని పూడ్చుకోవచ్చు!

శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే వికారం, వాంతులవడం, ఆకలి లేకపోవడం, అలసట, నీరసం, అధిక రక్తపోటు, ఆస్టియోపొరోసిస్‌.. వంటి సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ లోపాన్ని పూడ్చుకోవాలంటే మెగ్నీషియం అధికంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు ఈ ఖనిజం ఎక్కువగా ఉండే సోప్‌స్టోన్‌ వంటపాత్రల్ని ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. వంట చేసే క్రమంలో ఈ రాయిలోని మెగ్నీషియం ఆయా పదార్థాల్లోకి చేరి.. మన శరీరానికి అందుతుంది. ఫలితంగా మెగ్నీషియం లోపాన్ని కొంతవరకు అధిగమించచ్చు.

వాటిని బ్యాలన్స్‌ చేస్తుంది!

పులుపు, మసాలాలు జోడించిన పదార్థాలు తినడం వల్ల వాటిలోని ఆమ్ల గుణాలు కడుపులో మంట, అజీర్తి.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. వీటిని దీర్ఘకాలం పాటు ఇలాగే తినడం అస్సలు మంచిది కాదు. అయితే ఇవే పదార్థాల్ని సోప్‌స్టోన్‌ కుక్‌వేర్‌లో వండుకొని తీసుకుంటే.. అందులో మిళితమై ఉన్న మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు వీటిలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించి.. పులుపు, మసాలా ఘాటును తగ్గిస్తాయి. అలాగని వంట రుచి తగ్గిపోదని, ఆయా జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే ఎక్కువ కాలం మన్నుతాయ్!

మిగతా పాత్రలతో పోల్చితే సోప్‌స్టోన్‌ పాత్రల్లో వంట చేయడం ద్వారా సమయం, గ్యాస్‌ రెండూ ఆదా అవుతాయంటున్నారు నిపుణులు. అయితే వీటి వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎక్కువ కాలం మన్నుతాయంటున్నారు.

* ఈ పాత్రల్ని సబ్బు, వేడి నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆపై పొడి కాటన్‌ వస్త్రంతో తుడవాలి.

* పొడిగా తుడిచిన తర్వాత పాత్రల లోపల, వెలుపల వంట నూనె పూయాలి. ఆపై వేడిగా, పొడిగా ఉండే ప్రదేశాల్లోనే ఈ పాత్రల్ని ఒక రోజంతా భద్రపరచాల్సి ఉంటుంది.

* ఈ పాత్రలు వేడిగా ఉన్నప్పుడు శుభ్రం చేయకూడదు.. పూర్తిగా చల్లారాక మాత్రమే వీటిని కడగాలి.

* ఈ పాత్రల్లో కలపడానికి చెక్క స్పూన్స్‌ మాత్రమే ఉపయోగించాలి. స్టీల్‌వి ఉపయోగిస్తే వాటిలో గీతలు పడి వాటి నాణ్యత తగ్గిపోతుంది.

‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్’ అన్నట్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే సోప్‌స్టోన్‌ వంట పాత్రల గురించి తెలుసుకున్నారుగా! మరి, ఇది వరకే వీటిని ఉపయోగిస్తున్నట్లయితే.. వాటిని వాడే క్రమంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవి ఎక్కువ కాలం మన్నాలంటే ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి..!


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని