Talwar Raas: కత్తులు చేపట్టి మేమూ యుద్ధాలు చేయగలం! - all you need to know about talwar raas the dance performed by gujarat rajput women in telugu
close
Updated : 21/10/2021 19:36 IST

Talwar Raas: కత్తులు చేపట్టి మేమూ యుద్ధాలు చేయగలం!

(Photo: Screengrab)

అతివలంటే స్వయానా ఆ ఆదిపరాశక్తి అంశలే అని నిరూపిస్తున్నారు గుజరాత్‌ మహిళలు. ఆ అమ్మవారిలా అందరిపై కరుణ కురిపించడమే కాదు.. వీరత్వాన్ని ప్రదర్శించడంలోనూ తామేమీ తీసిపోమంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి రాజ్‌పుత్‌ వంశానికి చెందిన మహిళలు ఏటా ఐదు రోజుల పాటు ఖడ్గాలతో నృత్యం, విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి.. కత్తులతో వాళ్లు చేసే ఈ నృత్య ప్రదర్శనలు అక్కడి మహిళల ధీరత్వానికి ప్రతీకగా నిలుస్తుంటాయి. ‘Talwar Raas’గా పిలిచే ఈ సంప్రదాయ కళ వెనకున్న అసలు కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

దసరా సందర్భంగా దుర్గామాతను పూజించడం, ఆయుధ పూజ-వాహన పూజ.. వంటివి మనం ఎలాగైతే చేస్తామో.. గుజరాత్‌ ప్రజలు కూడా ఈ పండగ నేపథ్యంలో ఆయుధ పూజ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే అమ్మవారికి నీరాజనంగా అక్కడి రాజపుత్రుల వంశానికి చెందిన మహిళలు ఖడ్గాలు చేతబూని నృత్య ప్రదర్శన చేస్తుంటారు.

పుష్కర కాలం నుంచి..!

రాజపుత్రుల వంశం వారు నిర్వహించే ఈ నృత్య విన్యాసాలు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 19న మొదలైన ఈ ప్రదర్శన 24 వరకు జరగనుంది. ఇందులో పాల్గొనే మహిళలంతా సంప్రదాయ దుస్తులు ధరించి.. నడుమును బెల్టుతో చుట్టేసి.. యోధురాల్లా తయారవుతారు. యుద్ధభూమిలో ఉన్నట్లుగా వాళ్లు ప్రదర్శించే ముఖ కవళికలు, అందరూ ఒకే సమయంలో ఒకే తరహా విన్యాసాలు చేయడం, ఈ క్రమంలో శరీరాన్ని విల్లులా వంచడం.. ఇవన్నీ వారిలోని ధీరత్వాన్ని చాటుతాయి. ఈ తరహా నృత్యాలు గత పన్నెండేళ్లుగా నిర్వహిస్తున్నామంటున్నారు రాజ్‌కోట్‌ యువరాణి కాదంబరీ దేవి.

ధీరత్వాన్ని చాటడానికే..!

‘ఏటా వందలాది మంది మహిళలు ఈ నృత్య ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే వారు సాధన చేయడం మొదలుపెడతారు. ఖడ్గాన్ని అమ్మవారి అంశగా భావించి పూజిస్తాం. పూర్వకాలంలో మహిళలు తాము పూజించిన ఖడ్గాన్ని యుద్ధభూమిలోకి వెళ్లే సమయంలో వాళ్ల భర్తలకు అందించేవారు. కానీ ఈ కాలం మహిళలు తామూ పురుషులతో సమానంగా యుద్ధభూమిలోకి దూకే ధీశాలులమే అని నిరూపించుకోవడమే ఈ నృత్య ప్రదర్శన వెనకున్న ముఖ్యోద్దేశం..’ అంటారామె.

ఇలా ఈ ఏడాది 200 మందితో కూడిన మహిళా బృందం ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొంది. గతంలో రెండు వేల మందితో కలిసి చేసిన ‘Talwar Raas’ ఈవెంట్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించింది. కేవలం గుజరాత్‌లోనే కాదు.. రాజస్థాన్‌లోనూ ఈ తరహా నృత్యం చేయడం అక్కడి సంప్రదాయం.

ఇవీ ప్రత్యేకమే!

ఇలా అక్కడి రాజపుత్ర వంశీయులే కాదు.. రైతు కుటుంబాలకు చెందిన వారు (Kanabi Raas), వారియర్‌ కమ్యూనిటీ/సైనిక కుటుంబాల ప్రజలు (Meher Raas), మత్స్యకార కుటుంబాలకు చెందిన వారు (Padhar Raas), గొల్ల కమ్యూనిటీకి చెందిన వారు (Hudo Raas).. ప్రత్యేక సందర్భాల్లో, ఆయా పేర్లతో సంప్రదాయ నృత్యాలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని