సూపర్ కిడ్... ఎంత జ్ఞాపక శక్తో! - at age of five this wonder kid from kerala bags nine record titles
close
Updated : 17/08/2021 20:03 IST

సూపర్ కిడ్... ఎంత జ్ఞాపక శక్తో!

(Photos: Screengrab)

ఐదేళ్లంటే బొమ్మలు చూస్తూ ఏ, బీ, సీ, డీ లు నేర్చుకునే వయసు. కానీ కేరళకు చెందిన ఓ చిన్నారి మాత్రం తన అద్భుతమైన జ్ఞాపకశక్తి, ప్రతిభా పాటవాలతో ఏకంగా ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది.

ఐదేళ్ల వయసులోనే రికార్డులు!

కేరళలోని కొల్లాంకు చెందిన ఆనంద్‌ కుమార్‌, నీనాఆనంద్‌ దంపతుల కుమార్తె మహాలక్ష్మి ఆనంద్‌. వయసు ఐదేళ్లు. కేజీ-2 చదువుతోంది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి అబుదాబిలో నివాసముంటోంది. చిన్నప్పటి నుంచి అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగిన ఈ చిన్నారి ఏదైనా చదివితే దానిని శాశ్వతంగా మెదడులోకి ఎక్కించుకుంటుంది. అర్ధరాత్రి నిద్ర లేపి అడిగినా వెంటనే చెబుతుంది. తల్లిదండ్రులు కూడా ఆమె ప్రతిభా పాటవాలను గమనించి అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే తన ప్రతిభాశక్తికి తార్కాణంగా పలు రికార్డులు నెలకొల్పింది.

నిమిషంలోనే! 

42 మంది శాస్త్రజ్ఞులు, వారి ఆవిష్కరణలను ఒక నిమిషంలోనే గుర్తించి...ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్లో స్థానం సంపాదించింది మహాలక్ష్మి. దీంతో పాటు ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, బ్రిటిష్‌ వరల్డ్ రికార్డ్స్‌, కలామ్‌ వరల్డ్‌ ఫర్‌ ఎక్స్‌ట్రార్డినరీ గ్రాస్పింగ్‌ పవర్‌ జీనియస్‌ కిడ్‌ వంటి మూడు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది.

26 సెకన్లలోనే రాష్ట్రాలు - రాజధానులు!

మహాలక్ష్మి కొన్ని నెలలుగా భరతనాట్యంలో కూడా శిక్షణ పొందుతోంది. ఈ అనుభవంతోనే 81 ముద్రలలో 55 ముద్రలను కేవలం 53 సెకన్లలో ప్రదర్శించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. దీంతో పాటు ఇంటర్నేషనల్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌, బ్రిటిష్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకుందీ సూపర్‌ కిడ్. ఇక ఇండియాలోని రాష్ట్రాలు-రాజధానులను కేవలం 26 సెకన్లలో చెప్పిన అతి పిన్న వయస్కురాలిగా మరో ఘనతను అందుకుంది మహాలక్ష్మి. అది కూడా అక్షర క్రమంలో!

గూగుల్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది!

ఇలా తన ప్రతిభాపాటవాలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న మహాలక్ష్మిని చూసి ఆమె తల్లి తెగ సంబరపడిపోతోంది. ‘ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్న ఆసక్తి నా కూతురుకు చిన్నప్పటి నుంచే ఉంది. తనకు ఏడాదిన్నర వయసున్నప్పుడు నేను పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేదాన్ని. అప్పుడు తను దగ్గరకు వచ్చి నేను కూడా చదువుకుంటానంది. దీంతో సరదాగా శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణల గురించి తనకు నేర్పించాను. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఒకసారి వీటి గురించి నేను చెప్పినవన్నీ వేగంగా నాకు అప్పగించేసింది. ఇవొక్కటే కాదు.. నేను చెప్పిన ఏ విషయమైనా తను మెదడులో శాశ్వతంగా భద్రపరచుకుంటుంది. ఇక మూడేళ్లు వచ్చేనాటికి ఇవే విషయాలను ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌లో చెప్పడం నేర్చుకుంది. ఏదైనా నేర్చుకోవడంలో తన ఉత్సాహాన్ని, ఆసక్తిని చూస్తుంటే మాకెంతో ముచ్చటేస్తుంటుంది. కొన్నిసార్లు తను అడిగే ప్రశ్నలకు నేను, మా వారు కూడా సమాధానాలు చెప్పలేకపోతున్నాం. గూగుల్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది’ అని చెబుతోంది నీనా.

ఇదేవిధంగా మరి మీ పిల్లలు కూడా వివిధ అంశాల్లో ప్రతిభావంతులా? అయితే వారి ప్రతిభాపాటవాల గురించి, వారు సాధించిన అరుదైన రికార్డుల గురించి ‘వసుంధర’ వేదికగా పంచుకోండి.. ఇతర తల్లిదండ్రులకు, వారి పిల్లలకూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని