నా దృష్టిలో అందమంటే అదే.. అందుకే ఆ ప్రకటనలకు ‘నో’ చెప్పా! - avika gor on refusing to endorse fairness creams
close
Updated : 12/06/2021 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా దృష్టిలో అందమంటే అదే.. అందుకే ఆ ప్రకటనలకు ‘నో’ చెప్పా!

Photos: Instagram

నేటితరం అమ్మాయిల్లో చాలామంది సినిమా తారలనే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. వారిలాగే ఆపాదమస్తకం అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం వివిధ ప్రకటనల్లో కనిపించే ఫెయిర్‌నెస్‌ క్రీంలు, సౌందర్య ఉత్పత్తుల్ని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం బాగా క్రేజ్‌ ఉన్న కథానాయికలనే ఎంచుకుంటున్నాయి. అయితే ఇలాంటి అసంబద్ధ ప్రకటనలకు తాను పూర్తి వ్యతిరేకమంటోంది అవికా గోర్‌. ఇలాంటి ప్రకటనల్లో నటించి నేటి తరం అమ్మాయిలను పెడదోవ పట్టించలేనంటోంది.


‘బాలికా వధూ’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’) సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్‌. బాలనటిగా కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక 2010లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘తను నేను’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’.. సినిమాలతో తెలుగు సినీ ప్రియులకు బాగా చేరువైంది. గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇటీవల సన్నజాజి తీగలా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ని, బరువు తగ్గేందుకు దోహదం చేసిన అంశాల్ని పంచుకుని తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపింది.


అందుకే వాటిని తిరస్కరించాను!
గతంలో రూ.2 కోట్ల ఆఫర్‌ వచ్చినా ఓ ఫెయిర్‌నెస్‌ క్రీం యాడ్‌లో నటించేందుకు తిరస్కరించింది సాయిపల్లవి. తాజాగా అవికా గోర్‌ కూడా అదే పని చేసింది. తనను వెతుక్కుంటూ వచ్చిన ఓ బ్యూటీ క్రీం ప్రకటనకు నో చెప్పి వార్తల్లో నిలిచింది. ఇలా తన మనసుకు నచ్చిన పనే చేశానంటోందీ ముద్దుగుమ్మ. 
‘నా మనసుకు నచ్చిందే చేశాను. ఈ ఫెయిర్‌నెస్‌ క్రీంలు, ఉత్పత్తులపై నాకు నమ్మకం లేదు. మరి అలాంటిది వీటిని వాడమని ఇతరులకు ఎలా చెప్పగలను? అంతేకాదు.. ఓ నటిగా నేను అవాస్తవాలను ప్రచారం చేయను. ఇలాంటి అసంబద్ధ ప్రకటనలు నేటి తరం అమ్మాయిల్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. అందుకే బ్యూటీ క్రీం ప్రకటనలో నటించేందుకు తిరస్కరించాను’.


అందం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించదు!
‘దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. అందానికి సంబంధించి మన సమాజంలో కొన్ని మూస ధోరణులు ఉన్నాయి. తెల్లగా ఉంటేనే సౌందర్యమని చాలామంది భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే పలు బ్యూటీ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఇదే అవాస్తవాన్ని అతిగా ప్రచారం చేస్తున్నాయి. కానీ నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. కేవలం అందం ఒక్కటే మన పూర్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించదు. పైగా నేను ఓ నటిని. ఎవరినీ తక్కువ చేసి చూడాలనుకోను. నిజాలే చెప్పాలనుకుంటాను. అందమనేది రంగు, రూపుల్లో ఉండదు. ఆత్మవిశ్వాసంలోనే అసలైన అందం దాగుంటుంది. అందం కంటే మన పని, ఆలోచనలు, ప్రతిభతో పాటు మన వ్యక్తిత్వమే ఎంతో ముఖ్యం. ఈ లక్షణాలే మనమేంటో నిరూపిస్తాయి.’


నన్ను నేను ప్రేమించుకుంటున్నా!
‘ఇక నా దృష్టిలో అందం అంటే.. ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించుకోవడం.. సంతోషంగా ఉండడం. గతంలో నేను ఎంతో అప నమ్మకంతో జీవించేదాన్ని. నా ప్రతిభాపాటవాలపై నాకే అనుమానాలు తలెత్తేవి. అందంగా లేనని బాధపడేదాన్ని. అద్దంలో నన్ను నేను చూసుకోవడం ఏ మాత్రం ఇష్టముండేది కాదు. అయితే ఏ రోజైతే నా ఆలోచనా ధోరణిని మార్చుకున్నానో ఆ రోజు నుంచే నా శరీరం గురించి పట్టించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను. నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. సరిగ్గా తినడం, సంతోషంగా జీవించడం అలవాటు చేసుకున్నాను. అధిక బరువు తగ్గించుకోవడంలో ఇవే నాకు ఉత్ర్పేరకాలుగా పనిచేశాయి..’ అంటోంది అవిక.

 


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని