ఒక్కరోజు కూడా మిస్సవ్వకుండా నిన్ను ప్రేమిస్తుంటాను! - avika gor pens emotional note for boyfriend milind chandwani
close
Published : 13/08/2021 19:48 IST

ఒక్కరోజు కూడా మిస్సవ్వకుండా నిన్ను ప్రేమిస్తుంటాను!

ప్రేమికులకు ‘తొలి పరిచయం’ అనేది ఓ తీపి గుర్తు. తమ ప్రేమ బంధానికి పునాది వేసిన ఆ రోజును వారి జీవితాల్లో ఎంతో అపురూపమైనదిగా భావిస్తారు. అందుకే ఆ ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడల్లా ప్రేమికుల్లో ఒక రకమైన ఉత్సాహం, సంతోషం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే తేలియాడుతున్నారు అవికా గోర్‌-మిలింద్‌ చంద్వానీ. తమ ప్రేమబంధం చిగురించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వెకేషన్‌కి వెళ్లారీ లవ్‌ బర్డ్స్‌. ఈ సందర్భంగా అక్కడి అందమైన ప్రదేశాల్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయారు.

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌లో ఆనందిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవిక. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లోనూ నటించి ఇక్కడి సినిమా ప్రియులకు బాగా చేరువైంది. 2019లో వచ్చిన ‘రాజుగారి గది 3’ సినిమా తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించని అవిక...తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదట బరువు తగ్గి సన్నజాజి తీగలా మారిపోయి అభిమానులను సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి మరో షాక్‌ ఇచ్చింది.

సోనామార్గ్‌ వ్యాలీలో!

ఓ స్వచ్ఛంద సంస్థ సీఈవో మిలింద్‌తో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది నవంబర్‌లో బయటపెట్టిందీ భామ. అప్పటి నుంచి సందర్భమొచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియాలో తన ప్రియుడితో కలిసున్న ఫొటోలతో పాటు తమ రిలేషన్‌షిప్‌ సంగతులను కూడా పంచుకుంటోంది. ఈ క్రమంలో తమ ప్రేమ మొదలై రెండేళ్లు పూర్తవ్వడంతో సోనామార్గ్‌ వ్యాలీలో వాలిపోయారీ ప్రేమ పక్షులు. అక్కడ అందమైన ప్రదేశాల్లో సరదాగా గడుపుతూ తమ ప్రేమ సంగతులను పంచుకున్నారు.

నాపై నాకు నమ్మకాన్ని కలిగించావు!

ఈ సందర్భంగా మిలింద్‌తో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన అవిక ... ‘మిలింద్‌...రెండేళ్ల నుంచి నువ్వు నాకు తెలుసు. నీ కారణంగానే నా జీవితం ప్రేమ, సంతోషాలతో నిండిపోయింది. నీ పరిచయం నాపై నాకు నమ్మకాన్ని కలిగించింది. జీవితంలో ఎదిగేలా నన్ను ప్రతిరోజూ ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్స్‌. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. ఇలా జీవితంలోని ప్రతిక్షణం నీతోనే గడపాలని కోరుకుంటున్నా...ఐ లవ్యూ’ అని తన ప్రేమకు అక్షర రూపమిచ్చిందీ అందాల తార.

అప్పుడే రెండేళ్లు గడిచాయా?

ఈ సందర్భంగా మిలింద్‌ కూడా తన ప్రేయసితో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ‘నిన్ను కలుసుకొని అప్పుడే రెండేళ్లు గడిచాయా?..ఇది నమ్మశక్యంగా లేదు. నువ్వు ఎప్పటినుంచో నా జీవితంలో ఉన్నట్లు అనిపిస్తోంది...అదే సమయంలో ఇప్పుడిప్పుడే కొత్తగా మన పరిచయం మొదలైనట్లు అనిపిస్తోంది. అందుకు కారణం మనిద్దరం గడుపుతోన్న ఆనంద క్షణాలే. రెండేళ్ల క్రితం అనుకోకుండా నిన్ను కలిశాను. ఆ సమయంలో నువ్వు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తివి అవుతానని అసలు అనుకోలేదు.’

నేనెంత అదృష్టవంతుడినో చెప్పలేను!

‘నువ్వు ప్రతిరోజూ నా హృదయాన్ని ప్రేమతో నింపావు. కొన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెట్టానని తెలుసు. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుని అండగా నిలిచావ్‌. అందుకే ఈరోజు అందరి ముందు నీకొక విషయం చెప్పాలనుకుంటున్నా...నువ్వు నా జీవితాన్ని వెలుగులతో నింపేశావు...ప్రతిరోజూ నన్ను నేను అభివృద్ధి చేసుకునేలా అవకాశమిచ్చావు. భవిష్యత్‌లో మనం జంటగా సాగించాల్సిన ప్రయాణానికి మార్గదర్శిలా నిలిచావు. అందరికంటే నన్ను బాగా అర్థం చేసుకున్న నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అందుకే నా మనసులోని భావాలను ఇలా వ్యక్తపరుస్తున్నాను.. ‘నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నేనెంత అదృష్టవంతుడినో ఎన్నటికీ వర్ణించలేను. అదేవిధంగా నా మనసులో నీపై ఎంత ప్రేమ ఉందో కూడా చెప్పలేను. అందుకే ఒక్కరోజు కూడా మిస్‌ అవ్వకుండా ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్యూ డార్లింగ్‌..’ అని రాసుకొచ్చాడు మిలింద్.

ఈ సందర్భంగా తమ అందమైన ఫొటోలు తీసిన హీరో కల్యాణ్‌ దేవ్‌కు థ్యాంక్స్‌ చెప్పుకొచ్చారీ లవ్‌ బర్డ్స్‌. ప్రస్తుతం అవిక, కల్యాణ్‌ దేవ్‌ హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. దీంతో పాటు నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న ‘థ్యాంక్యూ’ చిత్రంలోనూ అవిక నటిస్తోంది.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని