నేను తిరిగి నా జుట్టుని పొందగలనా? - beautician advice on regrowth of hair in telugu
close
Published : 15/08/2021 09:24 IST

నేను తిరిగి నా జుట్టుని పొందగలనా?

నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టరు దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. ఆ తర్వాత కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. దాంతో మళ్లీ గుండు చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. రక్తహీనత సమస్య కూడా లేదు. జుట్టు పెరుగుదలకు కావాల్సిన ఆహారం తీసుకుంటున్నాను. కానీ నా జుట్టు చాలా పల్చగా ఉంది. చూడ్డానికి బట్టతలలా కనిపిస్తోంది. నేను తిరిగి నా జుట్టుని పొందగలనా? దయచేసి నాకు సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ జుట్టుని ఒత్తుగా పెంచుకోవడానికి, కుదుళ్లను దృఢంగా మార్చుకోవడానికి ఈ ప్రొటీన్‌ మాస్క్‌ని ప్రయత్నించండి. దీనిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం రండి...

ఒక బాటిల్‌లో కప్పు పెరుగు తీసుకొని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల ఆముదం నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనెని వేయండి. అలాగే ఒక గుడ్డులోంచి తీసిన తెల్లసొనని కూడా జత చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా షేక్‌ చేస్తే మీకు నురగ లాంటి పదార్థం వస్తుంది. దానిలో అర చెక్క నిమ్మరసాన్ని కలపండి. ఈ ప్యాక్‌ని మొదట జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఆపై మిగిలిన మిశ్రమాన్ని జుట్టంతా అప్లై చేసుకోవచ్చు.

ఇలా ప్యాక్‌ వేసుకున్న తర్వాత జుట్టుని ముడివేసుకుంటే మిశ్రమం కిందికి జారిపోకుండా ఉంటుంది. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై మొదట సాధారణ నీటితో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా కనీసం వారానికి రెండు సార్లు చేస్తే కొంత కాలానికి చక్కటి ఫలితం కనిపిస్తుంది.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని