ముక్కుపై మంగు మచ్చలు.. ఎలా పోతాయి? - beautician home remedies for remove blackheads in telugu
close
Updated : 15/09/2021 12:44 IST

ముక్కుపై మంగు మచ్చలు.. ఎలా పోతాయి?

హాయ్‌ మేడం.. మా అత్తగారి వయసు 53. కంటి చుట్టూ, ముక్కు మీద మంగు మచ్చలు వచ్చాయి. అవి ఏవైనా క్రీమ్స్‌ వాడితే పోతాయా? లేదంటే ఏదైనా ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలా? - ఓ సోదరి

జ. మీరు క్రీమ్స్‌ వాడాలనుకుంటే డెర్మటాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లచ్చు. లేదనుకుంటే ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. ఇందులో మీరు ఏది ఎంచుకున్నా సమానమైన ఫలితం ఉంటుంది.

ఇంటి చిట్కా కోసం.. ముందుగా మీరు ఒక టేబుల్‌ స్పూన్‌ కలబంద గుజ్జు తీసుకోవాలి. దానికి సమానమైన పరిమాణంలో అంటే టేబుల్‌ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ని కలపండి. ఆ తర్వాత రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపండి.

ఈ మూడింటినీ మిక్స్‌ చేసి మీకు ఎక్కడ మంగు మచ్చలున్నాయో అక్కడ అప్లై చేయండి. ఒక పది నిమిషాల తర్వాత మసాజ్‌ చేసుకొని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

అయితే ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా శరీరానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్‌ ధరించండి. అలాగే ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకునేటప్పుడు హెయిర్‌ డై లాంటివి ఉపయోగించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాలనుకున్నప్పుడు మంగు మచ్చలపై ఏదైనా మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి. మాయిశ్చరైజర్‌ లేనప్పుడు పాల మీగడను ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని