మర్దనతో మరిన్ని లాభాలు..! - benefits of scalp massage in telugu
close
Published : 18/08/2021 21:02 IST

మర్దనతో మరిన్ని లాభాలు..!

గోరువెచ్చని నూనెతో మాడుకు నెమ్మదిగా మర్దన చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదూ! ఈవిధంగా మర్దన చేసుకోవడం వల్ల కేవలం మాడుకు రక్తప్రసరణ సక్రమంగా జరగడమే కాకుండా జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. ఈ క్రమంలో మర్దన చేసుకోవడం వల్ల కలిగే ఇతర లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం కూడా తప్పనిసరి. లేదంటే జుట్టు ఎదగడం కాదు కదా.. ఉన్న జుట్టు కూడా వూడిపోతుంది. అందుకే ఆ విలువైన సమాచారం మీ కోసం..

కుదుళ్లకు పోషణ అందిస్తూ..

మాడుకు మర్దన చేసేటప్పుడు ఉపయోగించే నూనె జుట్టుకు పోషణనందించే జోజోబా లేదా బాదం వంటిదైతే మంచిది. దీనివల్ల కుదుళ్లకు రక్తప్రసరణ సాఫీగా జరగడమే కాకుండా కురులకు పోషణ కూడా లభిస్తుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.

కురులు మెరిసేలా..

నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ ఉపయోగపడుతుంది.

చుండ్రు రానీయకుండా..

తరచూ మర్దన చేసుకోవడం ద్వారా తలలో చుండ్రు చేరకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే కాలుష్యం వల్ల పేరుకుపోయే మురికిని సైతం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునే వీలు ఉంటుంది. ఫలితంగా శిరోజాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.

ముఖం ప్రకాశవంతంగా..

ఏంటీ?? తలకు మర్దన చేస్తే ముఖం ఎందుకు ప్రకాశవంతంగా కనిపిస్తుందాని ఆశ్చర్యపోతున్నారా?? కానీ ఇది నిజమండీ.. మాడుకు మృదువుగా మర్దన చేయడం వల్ల ఒత్తిడి తగ్గి రక్తప్రసరణ సక్రమంగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం కదా! అలాగే తలకు మర్దన చేయడం వల్ల ముఖానికి కూడా రక్తప్రసరణ సవ్యంగా జరిగి మోము కాంతివంతంగా మారుతుంది.

దుష్ఫలితాలు కూడా..

మాడుకు మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల లాభాలున్న మాట నిజమే. అయితే జాగ్రత్తగా ఉండకపోతే దానివల్ల దుష్ఫలితాలు కూడా ఎదురవుతాయి.

* మర్దన చేసే క్రమంలో ఎక్కువ మొత్తంలో నూనె ఉపయోగించి, ఆతర్వాత సరిగా శుభ్రం చేసుకోకపోతే తల జిడ్డుగా మారడమే కాదు.. కేశ సంబంధిత సమస్యలను కూడా కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.

* మర్దన చేసే క్రమంలో స్ట్రోక్స్ సరిగా ఇవ్వకపోతే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

* చేతివేళ్లతో మర్దన చేసుకుంటాం కాబట్టి వాటికి గోళ్లు లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే అవి మాడుకు గీసుకుపోయే అవకాశం ఉంటుంది.

తలకు మర్దన చేసుకున్న తర్వాత ముఖానికి కూడా కాస్త మృదువుగా మసాజ్ చేసుకుంటే మరిన్ని సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎవరికి వారు స్వయంగా మసాజ్ చేసుకొనే కంటే నిపుణులు లేదా ఇతరులతో చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

చూశారుగా.. మాడుకు మర్దన చేసుకోవడం వల్ల కలిగే లాభాలు.. మరి, మీరు కూడా ఇవన్నీ గుర్తుంచుకుని తగిన జాగ్రత్తలు పాటించండి. ఒత్త్తెన కురుల సంపదను మీ సొంతం చేసుకోండి.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని