చాక్‌పీస్‌ని ఇలా కూడా ఉపయోగించవచ్చు.. - check out these chalk piece hacks
close
Published : 24/08/2021 18:58 IST

చాక్‌పీస్‌ని ఇలా కూడా ఉపయోగించవచ్చు..

చిన్న వస్తువులు ఒక్కోసారి పెద్ద సమస్యలు తీరుస్తాయి. అలాంటిదే చాక్ పీస్ కూడా..! కేవలం బోర్డు మీద రాయడానికో, ముగ్గులు వేయడానికో కాకుండా దీన్ని చాలా రకాలుగా వాడొచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

* దుస్తుల మీద, లెదర్ వస్తువుల మీద నూనె మరకలు పడ్డప్పుడు చాక్‌పీస్‌తో రుద్ది, ఒక పది నిముషాల తర్వాత దులిపేయాలి. చాక్‌పీస్ నూనె పూర్తిగా పీల్చుకుని మరకని మాయం చేస్తుంది.

* వెండి, రాగి, ఇత్తడి వస్తువులు నల్లబడుతున్నాయా? అయితే వాటిని తిరిగి మెరిపించాలంటే చాక్ పీస్ పొడితో శుభ్రపరిస్తే సరి..!

* చాక్ పీస్ పొడిని గుడ్డలో కట్టి తడిగా ఉన్న లేదా చెమట వాసన ఉన్న షూలలో రెండు గంటలపాటు(రాత్రంతా ఉంచితే మరీ మంచిది) ఉంచాలి. ఇలా చేస్తే తడి, వాసన పోయి షూలు శుభ్రంగా ఉంటాయి.

* పెన్నుతో రాసేటప్పుడు తప్పుదొర్లిందా..అందుబాటులో వైట్‌నర్ లేకపోతే కంగారు పడకండి. చాక్ పీసును వైట్‌నర్‌గా ఉపయోగించి చూడండి. సమస్య ఇట్టే పరిష్కారమౌతుంది.

* అతి ముఖ్యమైన పేపరు మీద నీళ్లు ఒలికిపోయాయా..? ఫర్వాలేదు.. ఆ తడి మీద చాక్‌పీసును దొర్లించండి. మంత్రం వేసినట్టు నీరంతా మాయమౌతుంది.

* తాళపు చెవి తరచూ తాళంలో ఇరుక్కు పోతుంటే ఆ తాళానికీ తాళపు చెవికీ చాక్ పీసును రుద్దండి. సమస్య పరిష్కారమౌతుంది.

చీమలు పోవాలంటే ఇలా చేయండి. చాక్‌పీసుని కాస్త గ్యాసోలిన్ నూనెలో తడపాలి. లేదంటే దానిపై నాలుగు లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలు వేయాలి. ఆ చాక్ పీసును గోడ వెంబడి గీస్తే ఇక చీమలు ఆ ప్రదేశానికి రావు.

* తెల్లని గోడలపై పగుళ్లను, మేకులు కొట్టిన మరకలను, చాక్ పీసుతో రుద్ది కవర్ చేయొచ్చు.

* పాత దుస్తులు, దుప్పట్లు పెట్టే ప్రదేశంలో చాక్ పీసులని ఒక పల్చని గుడ్డలో కట్టి ఉంచితే ముతక వాసన రాదు.

ఇవండీ చాక్‌పీస్ ఉపయోగాలు.. ఇవి కాకుండా మీకు మరిన్ని చాక్‌పీస్ చిట్కాలు తెలిస్తే మాతో పంచుకోండి..!



మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని