వంట త్వరగా పూర్తవ్వాలంటే ఈ కిటుకులు తెలిసుండాలి! - cooking hacks to save time and energy in telugu
close
Published : 26/09/2021 10:16 IST

వంట త్వరగా పూర్తవ్వాలంటే ఈ కిటుకులు తెలిసుండాలి!

రోజూ చేస్తున్న పనే అయినా.. వంట అనగానే నీరసించి పోతాం. ‘ఏది తప్పినా ఇది మాత్రం తప్పదు!’ అంటూ అసహనానికి గురయ్యే వారూ లేకపోలేదు. అయితే అదో పెద్ద పనిలా భావించకుండా వంట త్వరగా పూర్తి కావాలంటే కొన్ని ప్రాథమిక కిటుకులు తెలిసుండాలంటున్నారు నిపుణులు. తద్వారా సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గి కాస్త విశ్రాంతి కూడా దొరుకుతుంది. మరి, ఇంతకీ ఆ కిటుకులేంటో తెలుసా? ఇదిగో ఇవే..!

* వారానికి లేదంటే మూడు రోజులకు సరిపడా దోసె/ఇడ్లీ పిండి తయారుచేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటాం. అయితే ఈ మొత్తం పిండిలో ఉప్పు కలపకుండానే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే అది తాజాగా ఉంటుంది. రోజూ కావాల్సినంత పిండి తీసుకొని తగినంత ఉప్పు/ఇతర పదార్థాలు కలుపుకొని ఉపయోగించుకోవాలి.

* చపాతీలు అప్పటికప్పుడు చేసుకోవాలంటే పెద్ద పని. అదే మరుసటి రోజుకు సరిపడా చేసుకుందామంటే చల్లారిపోయి తినాలనిపించదు.. పైగా గట్టిపడతాయి కూడా! పోనీ పిండైనా తడిపి పెట్టుకుందామనుకుంటే అది నల్లబడుతుంది. ఇలాంటప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో సెమీ-కుక్‌డ్‌ రోటీస్‌ తయారుచేసి పెట్టుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చపాతీ తయారుచేసుకొని పూర్తిగా కాల్చకుండా ఇరువైపులా పది సెకన్ల పాటు కాల్చుకొని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవాలి. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్తిగా కాల్చుకొని వేడివేడిగా లాగించేయచ్చు. ఒకవేళ వీటిని ఫ్రిజ్‌లో పెట్టినా గది ఉష్ణోగ్రతకు వచ్చాకే కాల్చుకోవడం మంచిది.

* కొత్తిమీర, పుదీనా, మెంతి.. వంటివి కట్‌ చేసుకొని పెట్టుకునే సమయం ఉండచ్చు.. ఉండకపోవచ్చు! ఇలాంటప్పుడు.. మట్టి ఉన్నంత వరకు వాటి కాడలు కట్‌ చేసి.. ఓ గ్లాస్‌ నీటిలో ఆ కాడలు మునిగేలా ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. లేదంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెర్బ్‌ సేవర్స్‌ని కూడా వినియోగించుకోవచ్చు. తద్వారా అవి కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి.. ఎప్పుడంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత కూరల్లో తరిగి వేసుకుంటే సరి!

* కొన్ని వంటకాల్ని తయారుచేసే క్రమంలో టొమాటోపై ఉండే తొక్క తొలగిస్తుంటాం. ఈ పని ఈజీగా పూర్తవ్వాలంటే టొమాటోల్ని ముందు పావుగంట పాటు మరిగే నీళ్లలో వేసి.. ఆ తర్వాత ఐస్‌ నీళ్లలో పూర్తిగా చల్లారేంత వరకు వేసి ఉంచితే సరిపోతుంది.

* జ్యూసులు, స్మూతీస్‌ చేసుకోవాలనుకున్న ప్రతిసారీ పండ్లను ముక్కలుగా కట్‌ చేసుకోవడం కుదరకపోవచ్చు. అందుకే ముందే ఏ పండుకా పండు ముక్కలు చేసుకొని .. వాటిని సెపరేట్‌గా ఫుడ్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌/ఫ్రీజర్‌లో పెట్టేయాలి. అవసరమున్నప్పుడు తాజాగా ఉపయోగించుకోవచ్చు.

* మాంసంతో చేసే కొన్ని రకాల వంటకాల కోసం వాటిని సన్నటి స్లైసుల్లా చేసుకోవడం సహజమే! ఈ క్రమంలో ఇవి జారిపోకుండా, చక్కగా కట్‌ కావాలంటే వాటిని ఓ అరగంట పాటు ఫ్రీజర్‌లో ఉంచితే సరిపోతుంది.

* కాస్త ఎక్కువ సేపు ఉడికిన గుడ్లపై పెంకులు తొలగించడం కష్టమే! అలాంటప్పుడు గుడ్లను ఉడికించేటప్పుడే ఆ నీటిలో కొద్దిగా బేకింగ్‌ సోడా లేదంటే వెనిగర్‌ వేస్తే పెంకులు తీయడం సులువవుతుంది.

మరి, వంట త్వరగా పూర్తవ్వాలంటే మీరు పాటించే కిటుకులేంటి? మాతో పంచుకోండి!


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని