పెరుగుతో జుట్టు మెరిసిపోతుంది! - curd hair packs for healthy hair in telugu
close
Published : 09/08/2021 19:49 IST

పెరుగుతో జుట్టు మెరిసిపోతుంది!

ఎన్ని కండిషనర్లు రాసుకున్నా మీ జుట్టు మళ్లీ పొడిగానే తయారవుతోందా?? జుట్టు చివర్లు చిట్లిపోయి.. జుట్టంతా డ్యామేజ్ అవుతోందా?? చుండ్రుతో వెంట్రుకలు బలహీనమై ఎక్కువగా రాలిపోతున్నాయా?? అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ఓ సహజసిద్ధమైన మార్గం ఉంది. అదేంటంటే.. పెరుగుతో తయారుచేసిన హెయిర్ ప్యాక్స్ ఉపయోగించడం. పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని, మెరుపును ఇస్తాయి. అలాగే ఈ ప్యాక్స్ ఎండ, కాలుష్యాల నుంచి కూడా కేశాల్ని కాపాడడంలో సహాయపడతాయి. ఈ క్రమంలో పెరుగుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కొన్ని హెయిర్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందాం.. రండి.

తేనెతో షైనీగా..

జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది.

కావాల్సినవి

* గడ్డ పెరుగు - ఒక కప్పు

* నిమ్మరసం - ఒక చెంచా

* తేనె - ఒక చెంచా

ప్యాక్ ఇలా!

ముందుగా గడ్డ పెరుగులో నిమ్మరసం, తేనె వేసి పేస్ట్‌లాగా అయ్యేంత వరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్త్లె చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా ఎదుగుతుంది.

* వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్‌తో..

మీ కుదుళ్లు పొడిగా అయిపోయి.. చుండ్రు సమస్య బాధిస్తోందా? అయితే డోంట్‌వర్రీ. ఈ ప్యాక్ ఓసారి ప్రయత్నిస్తే సరిపోతుంది.

కావాల్సినవి

* గడ్డ పెరుగు - ఒక కప్పు

* ఆలివ్ ఆయిల్ - మూడు చెంచాలు

ప్యాక్ ఇలా!

ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోంచి కాస్త మిశ్రమాన్ని తలపౖౖె వేసి ఓ పది నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్‌తో జుట్టు మొత్తం కింది వరకూ ప్యాక్‌లాగా వేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.

మృదువైన కురుల కోసం..

జుట్టు పొడిగా ఉంటే ఎంత అసౌకర్యంగా ఉంటుందో కదూ! మరి ఇలాంటి కురులను మృదువుగా, తేమ నిలిచి ఉండేలా తయారు చేసుకోవాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించచ్చు.

కావాల్సినవి

* గడ్డ పెరుగు - ఒక కప్పు

ప్యాక్ ఇలా!

గడ్డ పెరుగు తీసుకుని పేస్ట్‌లాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా తయారైన పేస్ట్‌ను జుట్టుకు, కుదుళ్లకు పట్టించి మాస్క్‌లాగా వేసుకోవాలి. తర్వాత తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకొని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. దీనివల్ల జుట్టు మృదువుగా తయారవడంతో పాటు మెరుపు కూడా వస్తుంది.

* నార్మల్ హెయిర్ ఉన్న వారు వారానికోసారి, పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిది.

మినుములతో..

జుట్టు మృదువుగా, బలంగా తయారు కావాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించండి.

కావాల్సినవి

* మినుములు - అర కప్పు

* పెరుగు - అర కప్పు

ప్యాక్ ఇలా!

మినుముల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు దృఢంగా, మృదువుగా, అందంగా తయారవుతుంది.

* ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు వేసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది.

మెంతులతో మెరుపు..

మీ జుట్టు చివర్లు చిట్లిపోయి ఎక్కువగా జుట్టు రాలిపోతోందా?? అయితే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి..

కావాల్సినవి

* గడ్డ పెరుగు - ఒక కప్పు

* మెంతులు - పావు కప్పు

ప్యాక్ ఇలా!

ముందుగా మెంతుల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన పొడిని పెరుగులో వేసి పేస్ట్‌లా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్‌ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు, మాడుకూ పట్టించి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.

గుర్తుంచుకోండి..

* ఈ ప్యాక్‌ను పొడిగా ఉన్న జుట్టుపైనే అప్త్లె చేసుకోవాలి.

* వారానికోసారి ఈ ప్యాక్ ట్రై చేయచ్చు.

* వేసుకోవడానికి కనీసం రెండు గంటల ముందే ఈ ప్యాక్ తయారు చేసి పెట్టుకోవాలి.

అలాగే పైన చెప్పిన ప్యాక్స్ వేసుకున్న తర్వాత తలస్నానానికి ఉపయోగించే షాంపూ గాఢత తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.

చూశారుగా.. పెరుగు మీ జుట్టు సమస్యలను ఎలా పోగొడుతుందో.. కాబట్టి ఇలాంటి సహజసిద్ధమైన, సులభంగా తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మీ కురులను కాపాడుకోండి.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని