కేవలం 500 రూపాయలతో పెళ్లైపోయింది! - dhar city magistrate and army major marry in simple ceremony spending just rs 500
close
Updated : 15/07/2021 19:49 IST

కేవలం 500 రూపాయలతో పెళ్లైపోయింది!

పెళ్లంటే జీవితంలో జరిగే అతి పెద్ద వేడుక. ఉన్నంతలో అట్టహాసంగా, ఆడంబరంగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా ఖరీదైన దుస్తులు, విందులు, వినోదాలు, హల్దీలు, రిసెప్షన్ల రూపంలో లక్షలాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుంటారు. ఇది వరుడి కుటుంబ సభ్యులకు పెద్దగా భారం కాకపోవచ్చేమో కానీ కట్నకానుకలిచ్చే వధువు, ఆమె తల్లిదండ్రులకు మాత్రం తలకు మించిన భారమే. అందుకే కరోనా నిబంధనల నడుమ కేవలం 500 రూపాయలతో పెళ్లి తంతుని పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది ఓ జంట.

ఆడంబరాలకు దూరంగా!

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ సిటీ మెజిస్ట్రేట్‌ శివాంగి జోషి... ఇండియన్‌ ఆర్మీలో మేజర్‌గా పని చేస్తున్న అనికేత్‌ చతుర్వేదికి రెండేళ్ల క్రితమే వివాహం నిశ్చయమైంది. కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం కావడంతో వీరి వివాహం వాయిదాపడుతూ వస్తోంది. కొవిడ్‌ కట్టడి విధుల్లో శివాంగి పూర్తిగా నిమగ్నం కాగా... అనికేత్ లడఖ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కరోనా రెండో దశ ఉద్ధృతి కాస్త తగ్గడంతో పెళ్లిపీటలెక్కాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

రూ.500 డిపాజిట్‌ చేసి!

జిల్లా మెజిస్ట్రేట్‌ వివాహమంటే ఎంతో సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఏర్పాట్లు కూడా ఘనంగానే ఉంటాయి. అయితే ఇలాంటి ఆడంబరాలకు తాను వ్యతిరేకమంటూ సింపుల్‌గా కోర్టులో వివాహం చేసుకుంది శివాంగి. ఇందుకోసం ముందుగానే తన తల్లిదండ్రులతో పాటు వరుడి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించింది. ఆ తర్వాత కోర్టులో 500 రూపాయలు డిపాజిట్‌ చేసి సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్‌ చేసుకున్నారు శివాంగి, అనికేత్. కనీసం 10 మంది కూడా ఈ పెళ్లిలో కనిపించలేదు. ఇక పూల దండలు మార్చుకున్న అనంతరం వచ్చిన అతికొద్దిమంది అతిథులకు మిఠాయిలు పంచి వారి ఆశీర్వాదం తీసుకున్నారు నూతన వధూవరులు. అక్కడి నుంచి నేరుగా పురాతన ధారేశ్వర్‌ ఆలయానికి చేరుకుని దేవుడి దీవెనలు అందుకున్నారు.

ఆడంబరాలకు నేను దూరం!

‘వివాహం పేరుతో అనవసరంగా డబ్బు ఖర్చు చేయడానికి నేను వ్యతిరేకం. అందుకే ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాను. ఆడంబర వివాహాలతో వధువు, వారి తల్లిదండ్రులపై ఆర్థికంగా అదనపు భారం పడుతోంది. పైగా సంపాదించిన డబ్బును వృథాగా ఖర్చు పెట్టడం నాకే మాత్రం నచ్చదు’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ నూతన వధువు.

‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’ అంటూ సముద్రాలు, ఆకాశ హర్మ్యాల్లో భారీ ఖర్చులతో పెళ్ల్లిళ్లు చేసుకుంటున్న నేటి కాలంలో ఈ ఇద్దరు ఉన్నత ఉద్యోగులు నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం నిజంగా అభినందనీయమే. అందుకే వీరి వివాహం ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. శివాంగి, అనికేత్‌ల పెళ్లి ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని