అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే! - did you wash your towels regularly in telugu
close
Published : 28/06/2021 17:10 IST

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

90 శాతం టవల్స్‌లో..

ఒక అధ్యయనం ప్రకారం.. దాదాపు 90 శాతం టవళ్లలో కోలీఫామ్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇలాంటి క్రిములు, బ్యాక్టీరియాలు ఆవాసం ఏర్పరచుకున్న టవల్స్‌తో శరీరాన్ని తుడుచుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు టవల్స్‌ను శుభ్రం చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా లాంటి ప్రమాదకర వైరస్‌లు ముప్పతిప్పలు పెడుతున్న వేళ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. ఇంతకీ తువాలును శుభ్రంగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

క్రమం తప్పకుండా..

టవల్స్‌తో పాటు చేతి రుమాళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒక టవల్‌ను ఉతకకుండా ఎక్కువసార్లు ఉపయోగించకూడదు. అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా వేడి నీటిలో నానబెట్టి మంచి డిటర్జెంట్‌తో ఉతకాలి.

తడి టవల్‌ను అలా వేయకూడదు..

మనలో చాలామంది చేసే తప్పే ఇది. టవల్‌తో తడి శరీరాన్ని తుడిచిన తర్వాత బెడ్‌పై వేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే టవల్‌లో బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఇదే ముఖ్య కారణమని గుర్తుంచుకోండి. తడిగా ఉన్న టవల్‌ను వీలైతే ఆరు బయట ఎండలో ఆరేయడానికి ప్రయత్నించాలి. కుదరని పక్షంలో ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరేయాలి. టవల్‌కు ఉండే తడి వీలైనంత త్వరగా ఆరిపోయేలా చూసుకోవాలి.

కాస్త వెనిగర్‌ను కలపండి..

కేవలం టవల్స్ మాత్రమే కాకుండా అన్ని రకాల దుస్తులను ఉతికే సమయంలో డిటర్జెంట్‌తో పాటు ఒక కప్పు వెనిగర్‌ను కలపమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల దుస్తులు పూర్తి స్థాయిలో శుభ్రమవుతాయి.

ఇతరులతో పంచుకోకూడదు..

కొంతమంది ఒకరి టవల్‌ను మరొకరు ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరి టవల్‌ను వారే ఉపయోగించుకోవడం ఉత్తమం.

ఎక్కువ కాలం ఉపయోగించకూడదు..

ఇక కొంతమంది టవల్స్‌ను దీర్ఘకాలంగా ఉపయోగిస్తూనే ఉంటారు. దేనికైనా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి క్రమం తప్పకుండా టవల్స్‌ను మారుస్తూ ఉండాలి. సామాజిక దూరంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయచ్చని మనం ఇప్పటికే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఈ క్రమంలో- దుస్తుల విషయంలోనూ శుభ్రతను పాటించడం ఎంతో అవసరం.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని