నెలసరి రాక ఏడాదవుతోంది.. పీసీఓఎస్‌ వల్లేనా? - doctor advice on irregular periods
close
Published : 24/07/2021 17:34 IST

నెలసరి రాక ఏడాదవుతోంది.. పీసీఓఎస్‌ వల్లేనా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 29. ఇంకా పెళ్లి కాలేదు. నాకు నెలసరి రాక సంవత్సరమవుతోంది. గతంలో కూడా ఇర్రెగ్యులర్‌గా ఉంటే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను. పీసీఓఎస్‌ అని చెప్పి మాత్రలు ఇచ్చారు. అప్పుడు సమస్య తగ్గిపోయింది. అయితే అవి మానేశాక మళ్లీ సమస్య మొదలైంది. Meprate మాత్ర వేసుకుంటేనే వస్తుంది.. లేదంటే రావట్లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ: పీసీఓఎస్‌ అనేది దీర్ఘకాలిక సమస్య. ఇది జీవితాంతం ఉండే హార్మోన్ల అసమతుల్యత. అయితే మీకు శరీర బరువులో తేడాలొచ్చినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు ఈ సమస్య తీవ్రమవుతుంది. అందుకని మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి.. అవసరమైన పరీక్షలన్నీ చేయించుకొని ఎక్కువ కాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని