వార్డ్‌రోబ్‌ని ఇలా అందంగా సర్దేద్దాం! - easy ways to declutter your wardrobe in telugu
close
Published : 30/06/2021 19:11 IST

వార్డ్‌రోబ్‌ని ఇలా అందంగా సర్దేద్దాం!

ఇంటిని అందంగా ఉంచడం, ఇంట్లోని వస్తువుల్ని పొందిగ్గా సర్దడంలో ఇల్లాలి తర్వాతే ఎవరైనా! ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ అమర్చితే ఇల్లు నీట్‌గా కనిపిస్తుందన్న విషయం అందరికంటే ఎక్కువగా ఆమెకే తెలుస్తుంది. అయితే ఈ తరం మహిళలకు ఆ సమయం కూడా దొరకట్లేదనే చెప్పాలి. ఇందుకు కారణం.. నేటి మహిళలు వృత్తి ఉద్యోగాల్లో బిజీగా మారిపోవడమే! ఇక వారాంతాల్లో వచ్చే ఒకట్రెండు సెలవులు కూడా అత్యవసర పనులు చేసుకోవడానికే సరిపోతుంది. దీంతో ఇల్లంతా చిందరవందరగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ హడావిడిలో రోజూ వార్డ్‌రోబ్‌లో అవసరమున్న దుస్తులు బయటికి లాగేయడం, తిరిగి ఉతికిన తర్వాత వాటిని మడతపెట్టే సమయం లేక అలాగే అందులో పడేయడంతో వార్డ్‌రోబ్‌ అంతా చిందరవందరగా తయారవుతుంది. అలాగని దాన్ని అలాగే వదిలేయలేం. కాబట్టి దుస్తులు అమర్చే అల్మరాలో ఉపయోగించని దుస్తులు తొలగించి.. అవసరం ఉన్న వాటినే పొందికగా సర్దితే ఇటు వార్డ్‌రోబ్‌ నీట్‌గా కనిపించడంతో పాటు అటు సౌకర్యవంతంగానూ ఉంటుంది. మరి, అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే హడావిడిలో వార్డ్‌రోబ్‌లో చేతికందిన దుస్తుల్ని లాగడం, ధరించడం, తిరిగి వాటిని ఉతికిన తర్వాత మడతపెట్టకుండానే అందులో పడేయడం.. మనలో చాలామందికి అలవాటే! అయితే ఇది మొదట్లో బాగానే ఉన్నా.. నాలుగైదు రోజులు పోయాక అల్మరా అంతా చిందరవందరగా మారిపోతుంది. దాంతో ఏ డ్రస్సు ఎక్కడుందో అర్థం కాక దాన్ని వెతుక్కోవడానికి మరింత టైమ్‌ వేస్ట్‌! ఇంకొంతమందైతే ఉపయోగించని దుస్తుల్ని కూడా అందులోనే పడేస్తుంటారు. మరి, ఇలా కాకుండా ఉపయోగించే దుస్తులతోనే వార్డ్‌రోబ్‌ని పొందికగా సర్దుకోవాలంటే ఈ చిన్నపాటి టిప్స్‌ పాటిస్తే సరి!

వేటికవే అమర్చండి!

కొంతమంది సమయం లేక డ్రస్సులు, చీరలు, జీన్సులు.. ఇలా అన్నీ ఒకే చోట అమర్చుతుంటారు. తద్వారా ఒకటికొకటి సరిగ్గా దొరకదు. అందుకే మడతపెట్టేటప్పుడే వేటికవే జతగా ఉంచి.. వాటిని విడివిడిగా అల్మరాలో అమర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు చీరలన్నీ ఒక వరుసలో అమర్చుకోవచ్చు.. ఇక దానికి మ్యాచింగ్‌ బ్లౌజ్‌, పెటీకోట్స్‌.. వంటివి ఆ పక్కనే మరో వరుసలో అమర్చచ్చు.. లేదంటే చీరలోనే దానికి సంబంధించిన బ్లౌజ్‌, పెటీకోట్స్‌ని పెట్టి.. ఆ మొత్తాన్ని వార్డ్‌రోబ్‌లో సర్దుకుంటే వెతికే పనిలేకుండా కావాల్సినవి సులభంగా దొరుకుతాయి. ఇతర డ్రస్సులు, జీన్స్‌-టాప్స్‌.. వంటివాటికీ ఈ నియమం వర్తిస్తుంది. అలాగే మీరు రోజూ ఉపయోగించుకునే దుస్తులు ముందు వరుసలో అమర్చుకొని.. కాస్త అరుదుగా ఉపయోగించే వాటిని వెనకవైపు అమర్చుకోవడం మంచిది.

వారినీ భాగం చేయండి!

ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి దుస్తులూ ఒకే అల్మరాలో.. అది కూడా ఒకే షెల్ఫ్‌లో అమర్చే వారూ లేకపోలేదు. తద్వారా మీరెంత నీట్‌గా సర్దినా.. ఎదుటివారు చిందరవందరగా పడేసే అవకాశముంది.. పైగా ఇలా అందరి దుస్తులూ ఒకే ర్యాక్‌లో పెడితే అంత సులభంగా దొరకవు కూడా! కాబట్టి ఎవరు వేసుకునే దుస్తులు వారికి అందుబాటులో ఉండేలా వేర్వేరు ర్యాక్స్‌లో అమర్చాలి. అయినా కూడా ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు పదే పదే అల్మరాను చిందరవందరగా పడేస్తే.. వాటిని సర్దడానికి మీకు సమయం ఉండకపోవచ్చు. అందుకే వార్డ్‌రోబ్‌లో ఎవరి షెల్ఫ్‌ను వారు నీట్‌గా ఉంచుకోవాలన్న విషయం వారికి చెప్పి.. ముందునుంచే వారితో ఈ అలవాటు చేయించాలి. తద్వారా మీకు అదనపు పనీ తప్పుతుంది. దుస్తుల అల్మరా నీట్‌గానూ ఉంటుంది.

చిన్నదైనా ఇలా పొందికగా..!

చాలామంది వార్డ్‌రోబ్‌ విశాలంగా, పెద్దగా ఉంటేనే దాన్ని అందంగా సర్దుకోవచ్చు అన్న భావనలో ఉంటారు. కానీ చిన్నగా ఉండే అల్మరాలను కూడా నీట్‌గా అమర్చుకోవచ్చు. అయితే అందుకోసం హ్యాంగర్స్‌ ఉపయోగిస్తే స్థలం వృథా కాకుండా జాగ్రత్తపడచ్చు. ప్యాంట్స్‌-షర్ట్స్‌, చీరలు.. వంటి దుస్తుల్ని హ్యాంగర్స్‌కి తగిలించి అందులోని రాడ్‌కి వేలాడదీయచ్చు. అలాగే టర్కీ టవల్స్‌ వంటి కొన్ని దుస్తులు మడతపెట్టినా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అలాంటప్పుడు వాటిని మిగతా వాటితో కలిపి అమర్చితే అందులోని స్థలమంతా వృథా అవుతుంది. అందుకే వాటిని సెపరేట్‌గా ఒక పక్కకు పెట్టేయాలి.. లేదంటే వార్డ్‌రోబ్‌ బాస్కెట్స్‌ కూడా దొరుకుతాయి.. అందులో వాటిని పెట్టి అల్మరా పైన కూడా అమర్చుకోవచ్చు. ఇలా వార్డ్‌రోబ్‌ యాక్సెసరీస్‌తో చిన్న వార్డ్‌రోబ్‌ని పొందికగా సర్దుకుంటే ఇటు నీట్‌గా కనిపించడంతో పాటు అటు సౌకర్యవంతంగానూ ఉంటుంది.

సీజన్‌ను బట్టి..

వార్డ్‌రోబ్‌ చిందరవందరగా కనిపించకుండా నీట్‌గా ఉండాలంటే సీజన్‌ను బట్టి దాన్ని సర్దుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వర్షాకాలంలో సింథటిక్‌, సిల్క్‌.. వంటి తేలికపాటి దుస్తులైతే వర్షంలో తడిచినా త్వరగా ఆరిపోతాయి. కాబట్టి వాటిని హ్యాండీగా పెట్టుకొని.. మిగతా వాటిని అరుదుగా తెరిచే షెల్ఫ్‌లో పెట్టుకోవాలి. తద్వారా మనం రోజూ ఉపయోగించే షెల్ఫ్‌ని సర్దుకుంటే సరిపోతుంది. అలాగే కొంతమంది పాతబడిపోయిన స్వెట్టర్లు, షాలువాలను కూడా ఎప్పుడైనా ఉపయోగపడకపోతాయా అన్న ఉద్దేశంతో వార్డ్‌రోబ్‌లోనే ఉంచేస్తారు. తద్వారా పాత దుస్తులు, కొత్త దుస్తులతో వార్డ్‌రోబ్‌ అంతా కిక్కిరిసినట్లు కనిపిస్తుంది. కాబట్టి మీకు వద్దనుకున్న వాటిని ఎప్పటికప్పుడు వేరు చేసి అవసరార్థులకు అందించచ్చు.

కనీసం వారానికోసారైనా..!

అల్మరాలో నుంచి కావాల్సిన బట్టలు ఉపయోగించుకొని తిరిగి వాటిని మడతపెట్టి అందులో పెట్టినా ఒక్కోసారి అంతా చిందరవందరగా కనిపిస్తుంటుంది. అంతేకాదు.. రోజూ అందులో బట్టల్ని సర్దే ఓపిక, తీరిక మనకు ఉండకపోవచ్చు. అందుకే కనీసం వారానికోసారైనా లేదంటే పదిహేను రోజులకోసారైనా ఒక గంట సమయం కేటాయించి అందులో అవసరం లేని దుస్తుల్ని బయటికి తీసి, అవసరం ఉన్న వాటిని పొందికగా సర్దితే అటు నీట్‌గా కనిపిస్తుంది.. ఇటు సర్దడమూ సులువవుతుంది. ఇక కొంతమంది ఇళ్లలో కేవలం షెల్ఫులు మాత్రమే ఉండి.. వాటిపై కప్‌బోర్డ్స్‌ ఉండకపోవచ్చు. తద్వారా ఆ దుస్తులపై దుమ్ము పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగని వాటిని పదే పదే దుమ్ము దులిపి సర్దే సమయం ఉండదు. కాబట్టి కప్‌బోర్డ్స్‌ లేకపోతే దానికి బదులు ఒక కర్టెన్‌ వేసుకోవచ్చు. తద్వారా చూడ్డానికి నీట్‌గా కనిపిస్తుంది.. దుమ్ము వాటిపై చేరే అవకాశమూ ఉండదు.

ఇక వీటితో పాటు రోజూ ఉపయోగించే బ్యాగ్స్‌, జ్యుయలరీ, యాక్సెసరీస్‌.. వంటివన్నీ వేటికవే అల్మరాలో ఆయా ర్యాక్స్‌లో అమర్చుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇక చెప్పులు, షూస్‌.. వంటి వాటికి ఇంట్లో ఉండే వార్డ్‌రోబ్‌లో చోటివ్వడం కాకుండా.. వీలుంటే బయట చెప్పుల స్టాండ్‌/షూ ర్యాక్‌లో పెట్టుకుంటే వార్డ్‌రోబ్‌లో చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు..! మరి, ఇవి కాకుండా.. ఉపయోగించే దుస్తులు/వస్తువులతోనే వార్డ్‌రోబ్‌ను అందంగా సర్దుకునే చిట్కాలేవైనా మీకు తెలిస్తే మాతో పంచుకోండి.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని