ప్రెగ్నెన్సీలో రక్తపోటు.. ప్రమాదకరమా? - expert suggestion on high bp in pregnancy in telugu
close
Updated : 10/07/2021 15:29 IST

ప్రెగ్నెన్సీలో రక్తపోటు.. ప్రమాదకరమా?

నమస్తే డాక్టర్‌. నేను ఆరు నెలల (25 వారాలు) గర్భిణిని. ప్రస్తుతం నా కాళ్లలో వాపులొస్తున్నాయి. బీపీ 140/90 ఉంటోంది. దీనివల్ల ప్రెగ్నెన్సీలో, డెలివరీ సమయంలో ఏదైనా సమస్య వస్తుందా? దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: మీకు బీపీ ఎక్కువగా ఉంది అంటే ఇది జెస్టేషనల్‌ హైపర్‌టెన్షన్‌ (గర్భవతుల్లో పెరిగే బీపీ)కి కానీ లేదా ప్రి-ఎక్లాంప్సియా అన్న సమస్యకు కానీ సంకేతం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు బీపీ పెరగడమనేది ప్రమాదకరం. దీనివల్ల గర్భస్థ శిశువుకి, తల్లికి ఇద్దరికీ సమస్యలు రావచ్చు.. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. మీరు రెగ్యులర్‌గా ఎక్కడ చూపించుకుంటున్నారో అక్కడ మీ డాక్టర్ యూరిన్ అల్బ్యుమిన్తో పాటు ఇంకా కొన్ని రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుందని మీకు ఇప్పటికే సలహా ఇచ్చి ఉంటారు. ఒకవేళ సాధారణ చికిత్సతో సమస్య అదుపు కాకపోతే ఆస్పత్రిలో చేరి బీపీ అదుపులోకి వచ్చేంత వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి బీపీ మొదలైన తర్వాత మీ ప్రెగ్నెన్సీ రిస్క్‌తో కూడుకున్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ల సలహా ప్రకారం చికిత్స తీసుకుంటూనే ఉండాలి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని