పాప బరువు తగ్గుతోంది.. ఎందుకిలా? - expert suggestion on infant baby weight loss in telugu
close
Updated : 06/07/2021 20:58 IST

పాప బరువు తగ్గుతోంది.. ఎందుకిలా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 21. మా వారి వయసు 27. నాకు ఈమధ్యే పాప పుట్టింది. డాక్టర్‌ ఇచ్చిన డెలివరీ డేట్‌ కంటే వారం రోజుల ముందే ప్రసవం చేశారు. అయితే పాప బరువు 1.9 కిలోలు ఉండేసరికి మూడు రోజుల పాటు NICUలో ఉంచి ఇంటికి పంపించారు. ఇప్పుడు బరువు మరింతగా తగ్గి 1.7 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం పాపకు నా పాలు పడుతున్నా.. అలాగే మధ్యమధ్యలో ఫార్ములా ఫీడ్‌ కూడా ఇస్తున్నాం. అయినా బరువు పెరగకపోగా ఇంకా తగ్గుతోంది. ఎందుకిలా జరుగుతుంది? పాప బరువు పెరగాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: తొమ్మిది నెలలు నిండిన తర్వాత పుట్టినా కూడా మీ పాప బరువు తక్కువగా ఉందంటే గర్భం లోపల ఎదుగుదల సరిగ్గా లేదు అని అర్థం. ఈ పరిస్థితిని IUGR (Intrauterine growth restriction) అంటారు. ఒకవేళ ఇది ఉన్నా కూడా పుట్టిన తర్వాత వేరే సమస్యలేవీ లేకపోతే బరువు మామూలుగానే పెరగాలి. మొదటి పది రోజులు తగ్గినా.. తర్వాత రోజురోజుకీ బరువు పెరుగుతూ ఉండాలి. అలా జరగడం లేదంటే మీరు ఒకసారి పిడియాట్రీషియన్‌ని సంప్రదించండి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని