ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌.. జన్యుపరంగా వచ్చే సమస్యా? - expert suggestion on irregular periods in teenage in telugu
close
Updated : 02/07/2021 16:43 IST

ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌.. జన్యుపరంగా వచ్చే సమస్యా?

హాయ్‌ మేడమ్. నా వయసు 15 ఏళ్లు. నాకు ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్య ఉంది. దీంతో నెలసరి రాక సుమారు మూడు నెలలవుతోంది. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే హార్మోన్ల అసమతుల్యత అని చెప్పారు. రెండు నెలలు మందులు వాడమన్నారు. అయినా ఫలితం లేదు. ఈ సమస్య తగ్గాలంటే ఎన్నాళ్లు మందులు వాడాల్సి ఉంటుంది? నా వయసులో ఉన్నప్పుడు మా అమ్మ కూడా ఇదే సమస్యతో బాధపడిందట! జన్యుపరంగా ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయా? సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ: మీకు 15 ఏళ్లని రాశారు. కానీ మీరు పుష్పవతి అయి ఎన్ని సంవత్సరాలైందో రాయలేదు. ఎందుకంటే నెలసరి మొదలైన రెండు మూడు సంవత్సరాల వరకు పిరియడ్స్‌ సక్రమంగా నెలనెలకూ రాకపోవచ్చు. రుతుక్రమాన్ని నియంత్రించే హెచ్‌పీవో (హైపోథాలమిక్‌ పిట్యుటరీ ఒవేరియన్‌ యాక్సెస్‌) పరిణతి చెందడానికి సమయం పడుతుంది. ఒకవేళ మీకు నెలసరి మొదలై ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయి ఉంటే.. మీ అమ్మగారి లాగే జన్యుపరంగా సంక్రమించిన హార్మోన్ల అసమతుల్యత కావచ్చు. చాలావరకు ఇది పీసీఓఎస్‌ అయి ఉంటుంది. మీకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్ల పరీక్షలు చేయడం ద్వారా డాక్టర్లు దీనికి అసలు కారణమేంటో తెలుసుకోగలుగుతారు. ఇటువంటి సందర్భాల్లో హార్మోన్ల మాత్రలు కొన్ని సంవత్సరాల వరకు వాడాల్సి ఉంటుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని