ఆర్థిక భరోసా కోసం ఇవి! - financial independence for woman in telugu
close
Published : 14/09/2021 18:31 IST

ఆర్థిక భరోసా కోసం ఇవి!

అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. నేటికీ చాలామంది మహిళలు ఆర్థిక విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త.. ఇలా ఎవరో ఒకరి మీద ఆధారపడుతుంటారు. ఆర్థిక అంశాల పట్ల సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. మరికొంతమంది మహిళలు పరిస్థితుల రీత్యా తాము సంపాదించిన మొత్తాన్ని తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా.. చాలామంది మహిళలు ఆర్థికంగా పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కొని ఈ ధోరణిని మార్చుకోకపోతే.. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే పెళ్లైనప్పట్నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమంటున్నారు.

‘జాయింట్‌’ కావాలనుకుంటే..!

కొంతమంది మహిళలు పెళ్లైన తర్వాత తమ బ్యాంక్‌ ఖాతాను భర్త ఖాతాతో జత చేసి జాయింట్‌ అకౌంట్‌గా మార్చుకుంటుంటారు. మరికొంతమంది జాయింట్‌ అకౌంట్‌ తీసుకొని.. అందులో ఇద్దరూ కలిపి పొదుపు చేసుకుంటుంటారు. అయితే ఇలా చేయకపోవడమే మేలంటున్నారు నిపుణులు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ ఏదైనా గొడవ జరిగి భర్తతో విడిపోవాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బు మొత్తాన్ని మీ భాగస్వామి తమ అకౌంట్లోకి బదిలీ చేసుకోవచ్చు.. లేదంటే దాంతో తన పేరిట ఆస్తిపాస్తులు కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యం తగదు. ఒకవేళ జాయింట్‌ అకౌంట్‌ తప్పనిసరి అని మీరు భావిస్తే మీ వ్యక్తిగత ఖాతాను అలాగే ఉంచుకొని.. మీ భర్త ఖాతాలో భాగస్వామిగా చేరండి. కొన్ని బ్యాంకులు జాయింట్‌ అకౌంట్‌లో ఒకరిని ప్రాథమిక సభ్యుడిగా నిర్ణయిస్తాయి. అలాంటి సందర్భాల్లో మీరే ప్రాథమిక సభ్యులుగా ఉండేలా చూసుకోవడం వల్ల మీరు నష్టపోకుండా జాగ్రత్తపడచ్చు.

ఉద్యోగం మానద్దు!

కొంతమంది మహిళలు తమ పరిస్థితుల రీత్యా అప్పటిదాకా తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. మరికొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదంటూ ఈ నిర్ణయం తీసుకుంటుంటారు. ఈ రెండూ ఆర్థికంగా మనకు చేటు చేసే నిర్ణయాలే అంటున్నారు నిపుణులు. తద్వారా మొదట్లో బాగానే ఉన్నా భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే ఉత్తమం. ఇందుకు మీ ఇంట్లో వాళ్లను ఒప్పించడం, వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించండి. తద్వారా భవిష్యత్తులో మీరు ఒంటరిగానే జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు.

అవగాహన పెంచుకోండి!

ఆర్థిక విషయాల గురించి పెళ్లి కాక ముందు తండ్రిపై, పెళ్లయ్యాక భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలోనూ కొందరున్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా డబ్బు పొదుపు-మదుపు విషయాల్లో అవగాహన లోపమే ఇందుకు కారణం. అయితే ఇలా ప్రతి చిన్న దానికీ వారిపైనే ఆధారపడడం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి డబ్బుల్ని ఎందులో పొదుపు చేయాలి? లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలి? వంటి ప్రాథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం అత్యవసరం అంటున్నారు నిపుణులు. అలాగని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఒక్కో విషయాన్ని ఒంట బట్టించుకుంటే ఆర్థిక విషయాల్లో మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి రాదు.

మీకంటూ ఆస్తిపాస్తులు!

మహిళలు ఉద్యోగం చేస్తున్నా ఆర్థిక పరమైన విషయాల్లో ఇంట్లోని మగవాళ్ల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటోందని.. దానివల్ల పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు.. వంటి నిర్ణయాలను పురుషులే ఎక్కువగా తీసుకుంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ విషయంలో కొందరు మహిళలు సాటి స్త్రీలలో స్ఫూర్తి నింపుతున్నారని చెప్పాలి. రియల్‌ ఎస్టేట్‌, ఇతర ఆస్తుల కొనుగోళ్ల విషయంలో మహిళల శాతం క్రమంగా పెరుగుతున్నట్లు ఇటీవల వెల్లడైన పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి మీరూ మీకంటూ స్థిరాస్తి ఏర్పరచుకోవడం మంచిది. మీ సంపాదనతో కొన్న ఆస్తుల్ని మీ పేరిటే రిజిస్టర్‌ చేయించుకోవడం ఉత్తమం. తద్వారా మీ కంటూ సొంత ఆస్తిపాస్తులు ఉన్నాయన్న ధీమా ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలుదొక్కుకోగలరన్న ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది.

ఇవి కూడా...

* మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోవాలి. ఇవి అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా కాపాడతాయి.

* మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు.. ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడిగితే గుడ్డిగా చేసేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా, వద్దా నిర్ణయించుకోండి. ఈ క్రమంలో ఆ పత్రాలు దేనికి సంబంధించినవో మీకు అవగాహన లేకపోతే నిపుణుల్ని సంప్రదించడంలో తప్పు లేదు.

* హిందూ వివాహ చట్టం ప్రకారం.. పెళ్లికి ముందు, తర్వాత మహిళలకు పుట్టింటి వారు/మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు/కానుకలను స్త్రీధన్‌ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం.. ఇలా ఏ రూపంలోనైనా ఉండచ్చు. వీటిని, వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవడమూ ముఖ్యమే.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని