ఒత్తయిన జుట్టుకోసం అవిసె గింజల ప్యాక్..! - flaxseed hair growth mask
close
Updated : 20/07/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒత్తయిన జుట్టుకోసం అవిసె గింజల ప్యాక్..!

అధిక బరువును తగ్గించుకోవడానికి అవిసె గింజలని (flax seeds) వాడడం చాలామందికి తెలుసు.అవిశ గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, అత్యధిక ఫైబర్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని, వెంట్రుకల కుదుళ్లని ఆరోగ్యంగా ఉంచే కొలాజెన్‌ల ఉత్పత్తికి తోడ్పడతాయి. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటే వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరుగుతాయి. ఒత్త్తెన జుట్టు మీ సొంతం కావాలంటే వారానికి రెండు సార్లు అవిసె గింజలతో చేసే ఈ సులువైన హెయిర్ మాస్క్ వేసుకుని చూడండి.

కావలసినవి..

* అవిసె గింజలు : ఒక కప్పు

* నీళ్లు : ఆరు కప్పులు

* కొబ్బరి నూనె : ఐదు టీస్పూన్‌లు

తయారీ..

ఒక కప్పు అవిసె గింజలకి ఆరు కప్పుల నీరు చేర్చి బాగా మరిగించాలి. నీళ్లు సగానికి రాగానే స్టౌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారినప్పుడు ఆ నీరు జెల్‌లా మారడం గమనించవచ్చు. ఇప్పుడు ఒక పల్చటి శుభ్రమైన క్లాత్‌ తీసుకుని, జెల్ నుంచి అవిసె గింజలను వడగట్టాలి. ఇలా వడగట్టిన జెల్‌కి ఐదు టీస్పూన్‌ల కొబ్బరి నూనెను చేర్చాలి.

ఎలా వాడాలి..?

హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు జుట్టు శుభ్రంగా, పొడిగా ఉండాలి. జుట్టుని సన్నని పాయలుగా విడదీస్తూ, హెయిర్ ప్యాక్ కోసం తయారు చేసుకున్న జెల్‌ని కుదుళ్ల నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. నెమ్మదిగా మునివేళ్లతో ఒకపది నిముషాల పాటు కుదుళ్లను మసాజ్ చేసి, గంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకోవాలి.

ఈ హెయిర్ ప్యాక్ జుట్టు పెరగడానికి తోడ్పడటమే కాకుండా హెయిర్ కండిషనర్ గానూ ఉపయోగపడుతుంది.


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని