పట్టుకొని నడిపించడానికి మరో చిన్నారి వచ్చాడు! - geeta basra and harbhajan singh blessed with a baby boy
close
Published : 10/07/2021 20:05 IST

పట్టుకొని నడిపించడానికి మరో చిన్నారి వచ్చాడు!

ఆలుమగల అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా పిల్లలు పుట్టినప్పుడు వారిలో కలిగే ఆనందం అనిర్వచనీయం. అయితే ఇప్పటికే ఒకసారి ఆ మధురానుభూతిని పొంది.. మరోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందితే.. అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి..! ప్రస్తుతం అలాంటి అమితానందంలోనే మునిగి తేలుతున్నారు బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా-టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌. ఐదేళ్ల క్రితం హినయా హీర్‌ అనే పాపకు జన్మనిచ్చిన ఈ లవ్లీ కపుల్‌.. తాజాగా మరో ముద్దుల బాబుకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుని మురిసిపోతున్నారీ లవ్లీ కపుల్‌.

రెండోసారి తల్లిదండ్రులయ్యారు!

చేసింది తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది గీతా బస్రా. తన కెరీర్‌ స్పీడ్‌ అందుకుంటున్న సమయంలోనే టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌తో పెళ్లిపీటలెక్కింది గీత. వివాహానికి ముందు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు. 2015 అక్టోబర్‌ 29న పంజాబ్‌లోని జలంధర్‌ వేదికగా గీత-హర్భజన్‌ల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న గీత తన మొత్తం సమయాన్ని కుటుంబానికే వెచ్చించింది. ఈ క్రమంలో 2016 జులైలో హినయా హీర్‌ ప్లహా అనే పాపకు జన్మనిచ్చి మొదటిసారి అమ్మగా ప్రమోషన్‌ పొందిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఇక ఈ ఏడాది మార్చిలో తాను మరోసారి తల్లి కాబోతున్నానంటూ ప్రకటించిందీ అందాల తార. అప్పటి నుంచి తన అనుభవాలు, అనుభూతులు, ప్రి-నాటల్‌ యోగా వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మురిసిపోయింది.

‘ఇట్స్‌ ఎ బాయ్‌’!

రెండోసారి గర్భం ధరించినప్పుడే ‘కమింగ్‌ సూన్‌...జులై 2021’ అంటూ తన డెలివరీ టైంను ప్రకటించిన గీత అనుకున్న సమయానికే పండంటి బాబును ప్రసవించింది. ఈ సందర్భంగా ఓ అద్భుతమైన వీడియోతో ‘ఇట్స్‌ ఎ బాయ్‌’ అంటూ తన సంతోషాన్ని షేర్‌ చేసుకుంది. ఇందులో తన బిడ్డ కోసం ముందుగానే సిద్ధం చేసుకున్న అందమైన ఊయల, టెడ్డీబేర్‌, బేబీ క్లాత్స్‌ను మనం చూడచ్చు. ‘మేం పట్టుకొని నడిపించడానికి మరో చిన్నారి చేయి మా ఇంట్లోకి అడుగుపెట్టింది. అతని ప్రేమ ఎంతో అమితమైనది. బంగారమంతటి విలువైనది. మాకు ఇదో అద్భుతమైన బహుమతి.. ఎంతో మధురమైనది.. ప్రత్యేకమైనది కూడా..! మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మమ్మల్ని మరోసారి అమ్మానాన్నలుగా ప్రమోట్‌ చేసినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఈ సంతోషంతో మేం ఉబ్బితబ్బిబ్బవుతున్నాం. మా క్షేమం గురించి ఆలోచిస్తూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ లవ్లీ మామ్‌.

ప్రముఖుల అభినందనలు!

హర్భజన్‌ కూడా ఇదే వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి మురిసిపోయాడు. అంతకుముందు పిల్లాడి కోసం ముందుగానే సిద్ధం చేసుకున్న రెండు అందమైన సాక్సులున్న ఫొటోను కూడా పంచుకున్నాడీ స్పిన్నర్‌. ఈ సందర్భంగా గీతాబస్రా-భజ్జీ దంపతులకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా, క్రికెట్‌ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలతో కామెంట్‌ సెక్షన్‌ని నింపేస్తున్నారు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని