రోజంతా ఉత్సాహంగా
close
Published : 08/06/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోజంతా ఉత్సాహంగా

తక్కువ ఆహారం తీసుకోవాలి... దాన్నుంచి ఎక్కువ శక్తి అందాలి. దాంతో రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేసుకోవాలి అనుకుంటున్నారా... అయితే ఈ ప్రొటీన్‌ షేక్‌లను ప్రయత్నించవచ్చు.

వాల్‌నట్‌: యాపిల్‌ను చిన్నముక్కలుగా కోసుకుని దీంట్లో రెండు, మూడు వాల్‌నట్లు, అరటిపండు, బాదం పాలు కలిపితే వాల్‌నట్‌ జ్యూస్‌ సిద్ధమవుతుంది.

బాదం: బాదంపాలల్లో పావుస్పూన్‌ చియాగింజలు, కొద్దిగా బెల్లం తురుము వేసి జ్యూస్‌ చేసుకోవాలి.

పాలకూర: కట్ట పాలకూరను తీసుకుని సన్నగా తరగాలి. దీంట్లో అయిదారు బాదం పలుకులు, పావుస్పూను అవిసె గింజలు, పావుస్పూన్‌ చియా గింజలు వేసి, గ్లాసు పాలు పోసి జ్యూస్‌ చేయాలి.

స్ట్రాబెర్రీ: రెండు స్ట్రాబెర్రీలను తీసుకుని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. దీంట్లో పది జీడిపప్పు పలుకులు, పాలు పోసి జ్యూస్‌ చేసుకోవాలి.

మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.netలో...


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని