మూడేళ్లొచ్చినా మాటలు రావడం లేదు!
close
Published : 08/06/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడేళ్లొచ్చినా మాటలు రావడం లేదు!

మా పాపకు మూడేళ్లు. చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడట్లేదు. ఏం చెప్పినా అర్థం చేసుకుంటుంది. తనకు మాటలు రావాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

పిల్లలు పుట్టి ఎదిగే క్రమంగా జరిగే ఘట్టాలను మైల్‌స్టోన్స్‌ అంటారు. అందులో భాగంగా వయసుకు తగినట్లు చిన్నారులు బోర్లాపడటం, పాకడం, నిల్చోవడం లాంటివి చేస్తారు. వీటిని గ్రాస్‌ మోటార్‌ స్కిల్స్‌ అంటారు. అలాగే చేతులను ఉపయోగించి వస్తువులను పట్టుకోవడం, అన్నం తినడం... లాంటి వాటిని ఫైన్‌ మోటార్‌ స్కిల్స్‌ అని పిలుస్తారు. మూడోది మాటలకు సంబంధించింది. నాలుగు నెలల వయసులో నోటితో శబ్దాలు చేయడం, ఎదుటివారిని గుర్తుపట్టి రకరకాల ధ్వనులు చేయడం, తొమ్మిది నెలలు వచ్చేటప్పటికీ మన మాటలను తిరిగి పలకడం, సంవత్సరం కల్లా అమ్మా, నాన్నా, అత్తా, తాతా... అంటూ రెండక్షరాల పదాలను మాట్లాడగలుగుతారు. మూడేళ్లు వచ్చేటప్పటికీ అర్థవంతంగా మాటలు వచ్చేస్తాయి. ఇక నాలుగోది ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకుని చేయడం, వారికి కావాల్సింది అడగడం. ఇది సోషల్‌ డెవలప్‌మెంట్‌ కిందకు వస్తుంది. ఈ నాలుగు అంశాలు మెదడు అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి.

మీ పాప ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకుని వారిని అనుసరిస్తోంది. కానీ తను అనుకున్నది చెప్పలేకపోతుంది. దీన్నిబట్టి తనకు స్పెసిఫిక్‌ స్పీచ్‌ డిలే సమస్య ఉందేమో అనిపిస్తోంది. ఇలాంటివి జన్యుపరంగానూ రావొచ్ఛు మేనమామ, మేనత్త, తాత, బాబాయి.. వీరిలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఆమెకూ రావొచ్ఛు మెదడులోని అన్ని భాగాలు బాగానే అభివృద్ధి చెందినప్పటికీ, మాట్లాడానికి సంబంధించిన భాగం వయసుకు తగినట్లుగా పరిపక్వం చెందకపోవచ్ఛు భయపడాల్సిన పని లేదు. పాపకు మాటలు వస్తాయి. కాస్త ఆలస్యం కావొచ్ఛు ముందుగా పాపను ఒకసారి ఈఎన్‌టీ నిపుణులకు చూపించండి. అలాగే స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ అసెస్‌మెంట్‌ చేయించాలి. ఇందుకోసం స్పీచ్‌ థెరపిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకసారి తెలివితేటల పరీక్ష (సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ ఫర్‌ ఇంటెలిజెన్స్‌) కూడా చేయిస్తే యావరేజ్‌ ఇంటెలిజెన్స్‌ ఎలా ఉందో తెలుస్తుంది. ఈ మూడు పరీక్షలు తప్పనిసరి. పాపకు యావరేజ్‌ ఇంటెలిజెన్స్‌ ఉండి ఈఎన్‌టీ సమస్య లేదంటే... స్పెసిఫిక్‌ స్పీచ్‌ డిలే సమస్య ఉందనుకోవాలి. కాబట్టి స్పీచ్‌ స్టిమ్యూలేషన్‌ ద్వారా మాటలు వచ్చేలా ప్రయత్నిస్తారు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని