సౌందర్యానికి ఉప్పందించండి
close
Published : 08/06/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సౌందర్యానికి ఉప్పందించండి

చిటికెడు ఉప్పును కూరలో వేయగానే అది కాస్తా రుచికరంగా మారిపోతుంది. అయితే ఈ ఉప్పు కూరలో వేసుకునేది కాదు. ఇది బాత్‌సాల్ట్‌. లావెండర్‌, రోజ్‌ వంటి ఎన్నో రకాల్లో లభిస్తుంది. చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. అవేంటంటే..

గోరువెచ్చని నీళ్లలో రెండు టేబుల్‌స్పూన్ల బాత్‌సాల్ట్‌ వేసి ఆ నీళ్లలో పాదాలను పావుగంటపాటు ఉంచాలి. దీంతో రక్తప్రసరణ మెరుగై అలసిన పాదాలకు సాంత్వన లభిస్తుంది.

స్నానం హాయిగా...

స్నానం చేయబోయే ముందు బకెట్‌ నీళ్లలో కప్పు బాత్‌సాల్ట్‌ వేయాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల అలసిన శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. ఈ ఉప్పులో ఉండే ఖనిజాలు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి.

పింక్‌సాల్ట్‌ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరానికి సాంత్వననిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. లావెండర్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఎన్ని ప్రయోజనాలున్నా బాత్‌సాల్ట్‌ను ఎక్కువగా వాడటం వల్ల శరీరం పొడిబారే ప్రమాదముంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలున్నవాళ్లు వైద్యుల సలహామేరకు వాడితే మంచిది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని