అడవిలో అమ్మయింది!
close
Published : 09/06/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడవిలో అమ్మయింది!

డుపులో నలుసు పడ్డప్పటి నుంచి ఆడకూతురు చాలా జాగ్రత్తగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డ బాగుండాలని వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటుంది. కానీ, అడవిలో అమ్మదనాన్ని చవిచూసిన సునయన పటేల్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ అటవీ ప్రాంతంలో కమాండోగా విధులు నిర్వహిస్తోందామె. రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్లింది. భుజాలకు పదికిలోలకు పైగా బరువున్న బ్యాగు తగిలించుకొని, చేతిలో ఏకే-47 గన్‌ పట్టుకొని అడవంతా తిరిగింది. కొండలు ఎక్కింది. లోయల్లోకి దిగింది. ‘సెలవులు తీసుకో’ అన్నారు అధికారులు. ‘ఓపిక ఉన్నన్ని రోజులు డ్యూటీలోనే’ ఉంటానందామె. నెలలు గడిచాయి. శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది సునయన. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పోలీసు అధికారులు ఆమెకు అభినందనలు చెబుతున్నారు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని