ప్రొటీన్లు అందుకోండి!
close
Published : 01/07/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రొటీన్లు అందుకోండి!

శరీరంలో ప్రొటీన్‌ తక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా ఆకలి ఎక్కువగా వేస్తుంది. జుట్టు ఊడిపోతుంది. గోళ్లు విరిగిపోతాయి. చర్మ సమస్యలూ వస్తాయి. మరి వీటిని అధిగమించాలంటే ప్రొటీన్లు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి.

జామకాయ: దీంట్లో విటమిన్‌-సి అధికమొత్తంలో ఉంటుంది. దాంతోపాటు మాంసకృత్తులూ ఎక్కువే ఉంటాయి. 100 గ్రాముల జామ నుంచి దాదాపు 2.6 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల మనలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. పీచు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారూ వీటిని తినొచ్ఛు వీటిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి రోగకారక క్రిములను అంతం చేస్తాయి.

ఎండుద్రాక్ష... ఇవి రుచిగా ఉండటంతోపాటు బోలెడు పోషకాలనీ అందిస్తాయి. వీటిలో ఐరన్‌, పొటాషియం, పీచు, విటమిన్లు, మాంసకృత్తులు తగిన పాళ్లలో ఉంటాయి. 100 గ్రాముల కిస్‌మిస్‌ నుంచి దాదాపు 3.39 గ్రాముల మాంసకృత్తులు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటిలో ఐరన్‌ ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఎదురుకాదు, దాంతో ముఖం కాంతిమంతంగా మారుతుంది.

పనసపండు... అద్భుతమైన రుచిని పంచే ఈ పండు మనలో మాంసకృత్తుల లేమి కలగకుండా చూస్తుంది. 100 గ్రాముల పండు నుంచి 1.8 గ్రాముల ప్రొటీన్‌ అందుతుంది. రోగనిరోధక కారకాలైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఐరన్‌లను కలిగి ఉంటుంది.

మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.net లో


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని