పైపెదవిపై వెంట్రుకలు...
close
Published : 01/07/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పైపెదవిపై వెంట్రుకలు...

నా పైపెదవి, చుబుకం మీద తరచూ వెంట్రుకలు వస్తున్నాయి. నెలకోసారి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి త్రెడ్డింగ్‌ చేయించుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లర్‌కు వెళ్లాలంటే భయమేస్తోంది. ఇంట్లోనే వీటిని తొలగించుకునే మార్గాలుంటే చెప్పగలరు? - ఓ సోదరి

హార్మోన్లలో హెచ్చుతగ్గులు, పురుష హార్మోన్లు ఎక్కువగా ఉండటం, కొన్ని రకాల క్రీమ్‌లు, ఔషధాలు ఎక్కువకాలం పాటు వాడటం... ఇలా అనేక కారణాల వల్ల ఇవి వస్తాయి. ఎఫ్లోర్‌నిథిన్‌ అనే క్రీమ్‌ వాడకం వల్ల కొంతవరకు వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది. వెంట్రుకలను శాశ్వత, తాత్కాలిక పద్ధతుల్లో నివారించవచ్ఛు లేజర్‌ చికిత్స ద్వారా వెంట్రుకలను తగ్గించవచ్చుకానీ దీనికి ఎక్కువ ఖర్చు, సిట్టింగ్స్‌ అవసరమవుతాయి. ఎలక్ట్రోలైసిస్‌లోనూ వెంట్రుకలను శాశ్వతంగా తొలగించవచ్ఛు తాత్కాలిక పద్ధతుల్లో ఇంట్లోనూ తొలగించుకోవచ్ఛు

ఇంట్లోనే తొలగించుకోవాలంటే...

టేబుల్‌స్పూన్‌ పంచదారలో టీస్పూన్‌ తేనె, నిమ్మరసం కలిపి కొంచెం వేడిచేస్తే వ్యాక్స్‌ తయారవుతుంది. దీన్ని అవసరమైన చోట రాసుకుని వ్యాక్స్‌ స్ట్రిప్‌తో నొక్కిపెట్టి లాగేయాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ రాయాలి. టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడాలో టాల్కం పౌడర్‌, కొద్దిగా నీళ్లు వేసి పేస్టు చేసి రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌లో కొద్దిగా అరటిపండు గుజ్జు వేసి మెత్తగా చేసి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. గుడ్డు తెల్లసొనలో టీస్పూన్‌ కార్న్‌ఫ్లోర్‌, పంచదార కలిపి పేస్టులా చేసి రాసుకుని అరగంట తర్వాత మెల్లగా శుభ్రం చేసుకోవాలి. హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌లు వాడటం వల్ల చర్మం నల్లగా మారుతుంది. అందువల్ల సహజమైన పద్ధతులను పాటిస్తే మంచిది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని