ఈ బెడద తప్పేదెలా...
close
Updated : 06/05/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ బెడద తప్పేదెలా...

పలురకాల వ్యాధులకు కారణమయ్యే బొద్దింకల సమస్య పరిష్కారానికి కొన్ని చిట్కాలు...
* హెయిర్‌స్ప్రేతో... చాలామంది దువ్విన జుట్టు చెదరకుండా ఉండటానికి హెయిర్‌స్ప్రే వినియోగిస్తారు. ఈ స్ప్రేతో బొద్దింకలకూ చెక్‌ పెట్టొచ్చు. రాత్రి నిద్రపోయే ముందు వంటింట్లో ఇవి కనిపించే ప్రాంతాలన్నింటిలోనూ హెయిర్‌స్ప్రేను చల్లండి. ఆ వాసనకు బొద్దింకలు చనిపోతాయి. ఉదయం వంటింటిని శుభ్రం చేసుకుంటే చాలు.
* బిరియానీ ఆకుతో... బొద్దింకలు తిరుగుతున్న చోట రెండు బిరియానీ ఆకులను ఉంచాలి. గది మూలల్లో, అలమర మూలల్లోనూ బిరియానీ ఆకుల పొడిని చల్లాలి. దాంతో దెబ్బకు పారిపోతాయి.
* అమోనియాతో... ముందుగా ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లవుజులు తొడుక్కోవాలి. రెండు కప్పుల అమ్మోనియాను బకెట్‌ నీళ్లలో కలపాలి. స్టవ్‌దిమ్మ, కప్‌బోర్డులు, వంటింటి మూలల్లో ఈ నీటిలో ముంచిన వస్త్రంతో తుడిస్తే ఆ వాసనకే బొద్దింకలు పరార్‌!
* పరిశుభ్రంగా... వంటింటి శుభ్రత మీద ఎక్కువ దృష్టిపెట్టాలి. వంట అయిపోగానే సింక్‌, గిన్నెలు ఉంచే ప్రాంతాన్ని కడిగేసి, చెమ్మ లేకుండా తుడిచెయ్యాలి. ఆహారపదార్థాల అవశేషాల్లేకుండా డైనింగ్‌ టేబుల్‌నూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మరవద్దు. బొద్దింకల రాకకు కారణమయ్యే ఈ విషయాల్లో జాగ్రత్తపడితే వీటిని చాలా వరకు అరికట్టొచ్చు.  
* చెత్తబుట్టను... నిద్రపోయే ముందు చెత్త బుట్టను ఇంటి బయట పెట్టడం మర్చిపోకూడదు. బొద్దింకలు పెరగడానికి చెత్తబుట్ట కూడా ప్రధాన కారణం. చెత్తని పారేశాక, దాన్ని శుభ్రం చేసి ఆరబెడితే చాలు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని