మా అమ్మ స్పందించడం లేదు! ఏం చేయాలి?
close
Updated : 07/05/2021 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా అమ్మ స్పందించడం లేదు! ఏం చేయాలి?

మా అమ్మకు 70 ఏళ్లు దాటాయి. మొన్నటి దాకా ఏ అనారోగ్యమూ లేదు. కానీ ఆరునెలలుగా మంచీ, చెడూ ఏ విషయం చెప్పినా ఆవిడ ప్రతిస్పందించడం లేదు. అలానే చూస్తోంది. ఇలా ప్రతిస్పందనలు ఎందుకు తగ్గిపోయాయో అర్థం కావడంలేదు. తనలో ఈ మార్పు ఎందుకొచ్చిందో, ఏం చేస్తే మునుపటిలా మామూలుగా అవుతుందో చెప్పగలరా?    

- ఓ సోదరి, విజయనగరం

ది డిమెన్షియా న్యూరో సైకలాజికల్‌ డిజార్డర్‌ అనిపిస్తోంది. సాధారణంగా 60 దాటాక మెదడులో నరాలు మెల్లగా క్షీణించడం మొదలు పెడతాయి. ఇది కొందరిలో త్వరగా మరికొందరిలో మెల్లిగా జరుగుతుంది. మీ అమ్మ గారికి 70 దాటాయి కాబట్టి ఆలోచనలకు సంబంధించిన మార్పులు వచ్చాయి. దీనివల్ల విన్నవి, చూసినవి అర్థం కాకపోవడం, సమయాన్ని, స్థలాలను, వ్యక్తులను గుర్తుపట్టలేకపోవడం, మతిమరపు, మాట్లాడకపోవడం, మాటలు అర్థం కాకపోవడం, ఏం మాట్లాడాలో తెలియకపోవడం లాంటివి జరుగుతుంటాయి. దీన్ని అల్జీమర్స్‌ డిమెన్షియా అంటారు. ఆవిడకి మెదడులో రక్తప్రసరణ తగ్గిపోవడం వల్ల గానీ, ఏదైనా కణితి వల్ల గానీ, ఏ కారణంతోనో మెదడు క్షీణించిపోవడం లేదా నరాలకు సంబంధించి ఇంకేదైనా ఇబ్బంది అయ్యుంటుందా అన్నది చూడాలి. 70 దాటాయి కాబట్టి డిమెన్షియా సంబంధిత వ్యాధి అయ్యుంటుంది. కాబట్టి న్యూరాలజిస్టుకు చూపించండి. సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌లతో నరాలకు సంబంధించి వ్యాధి ఏమైనా ఉందా లేక మెదడు కుంచించుకుపోయి అల్జీమర్స్‌ వచ్చిందా అనేది తెలుస్తుంది. తర్వాత సైకియాట్రిస్టు న్యూరోసైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా డిమెన్షియా ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని, ఆవిడకి ఏవిధంగా ట్రెయినింగ్‌ ఇవ్వాలో మీ  కుటుంబ సభ్యులకు నేర్పిస్తారు. ముఖ్యంగా వీటికి మందులు పెద్దగా అవసరం ఉండదు. మతిమరపు చాలా ఎక్కువగా ఉంటే మాత్రలు ఇస్తారు. ఆ మందులు వాడుతూ ట్రెయినింగ్‌ ద్వారా ఆవిడ పరిస్థితి ఇంకా క్షీణించకుండా, తన పనులు తాను చేసుకునేలా ఉండటానికి కేర్‌టేకర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ట్రెయినింగ్‌ ద్వారా సమస్య జటిలమవకుండా కొంతవరకూ అరికట్టవచ్చు. పూర్తిగా తగ్గించలేం. రాన్రాను ఎక్కువయ్యే అవకాశమూ ఉంది. కాబట్టి ఆవిడ ఉన్నంతవరకూ ఒకరిమీద ఆధారపడకుండా ఉండేలా, ఆమెకి ఎలా సాయం చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది నేర్పిస్తారు.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని