మృదువైన చర్మానికి మూడు!
close
Published : 08/05/2021 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మృదువైన చర్మానికి మూడు!

మృదువైన, కోమలమైన మెరిసే చర్మం కావాలని ఎవరికుండదు? ఇందుకోసం ఇంట్లోని సహజ పదార్థాలతో మోమును మెరిపించొచ్చు.

కీర... గ్లాసు నీటిలో రెండు మూడు కీర ముక్కలను వేసి బాగా మరిగించాలి. దీన్ని చల్లార్చి మిక్సీలో వేసి స్మూథీలా చేయాలి. వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. రోజూ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని స్ప్రే చేయాలి. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించి మృదువుగా చేస్తుంది. ఈ సీసాను ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
టొమాటో... కీర, టొమాటో ముక్కలను గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పక చేస్తే  చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. టొమాటోలోని ఎంజైమ్‌లు చక్కటి ఎక్స్‌ఫోలియేటర్స్‌గా పనిచేసి చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. ఈ పండుకు ఉండే యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు దద్దుర్లు, మొటిమలను తగ్గిస్తాయి.


కొబ్బరి నూనె.. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలోకి ఇంకిపోయి మృదువుగా మారుస్తుంది. బాగా మగ్గిన అవకాడో పండులో పావు ముక్కను తీసుకోవాలి. ఇందులో పెద్ద చెంచా కొబ్బరినూనె, అర చెంచా వక్కల పొడి వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుని పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.


వేసవిలో బీట్‌రూట్‌, క్యారట్‌ లాంటి వేడి కలిగించే దుంపలకు దూరంగా ఉండండి. చలవ చేసే సలాడ్స్‌ ఎక్కువగా తీసుకోండి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని