ముప్పైల్లో గర్భంతో ఇబ్బందా?
close
Published : 08/05/2021 00:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముప్పైల్లో గర్భంతో ఇబ్బందా?

నా వయసు 30. ఈ మధ్యే పెళ్లయ్యింది. నాలుగేళ్ల పాటు సంతానం వద్దనుకుంటున్నాం. ఇంట్లో వాళ్లు మాత్రం వయసు పెరిగితే గర్భం దాల్చినప్పుడు సమస్యలొస్తాయని చెబుతున్నారు. ఇది నిజమేనా? సాధారణంగా ఏ వయసులో సంతానం కోసం ప్రయత్నించాలి?

- ఓ సోదరి, ఆర్మూరు

చాలామంది సంతానం కావాలనుకునే ముందు చాలా విషయాల గురించి ప్రణాళిక వేసుకుంటారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కెరీర్‌, కుటుంబ పరంగా పుట్టబోయే బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా... ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకుని ప్లాన్‌ చేసుకుంటారు. అంతేకాకుండా దంపతుల మధ్య అవగాహన ఎలా ఉందనేది కూడా కొన్నాళ్లు చూసుకుని ఆ తర్వాత ప్లాన్‌ చేసుకోవడం చాలా మంచిదని కొందరి అభిప్రాయం.
మీ ప్రశ్నకు బయోలాజికల్‌గా మాత్రమే సమాధానం చెప్పగలను. ఆడపిల్లకు తల్లి కావడానికి, సంతాన సాఫల్యత (ఫెర్టిలిటీ) బాగా ఉండే వయసు ఉజ్జాయింపుగా 22 నుంచి 28 వరకు అని చెపొచ్చు. 30 దాటిన తర్వాత మన భారతీయ స్త్రీల శరీరంలో అండాల నిల్వ క్రమంగా తగ్గుతుంది. తల్లికి 35 దాటితే పుట్టబోయే బిడ్డకు జన్యుపరమైన లోపాలు కూడా ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అధిక రక్తపోటు, మధుమేహం, జననేంద్రియాల్లో ఫైబ్రాయిడ్స్‌ వంటి సమస్యలు ఎక్కువవుతూనే ఉంటాయి. అందుకని బయోలాజికల్‌గా చూస్తే పాపాయి కోసం మీరు త్వరగా ప్లాన్‌ చేసుకోవడమే మంచిది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని