దుర్వాసన దూరం చేద్దాం!
close
Published : 08/05/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దుర్వాసన దూరం చేద్దాం!

కాంతి, గాలి ప్రసరణ సరిగా లేనప్పుడు గదులు ఓ రకమైన వాసన వస్తుంటాయి. అది పోవాలంటే... ఫ్రెష్‌నర్లే అవసరం లేదు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనూ ప్రయత్నించొచ్చు.

కప్పు వంట సోడాలో పావుకప్పు సిట్రిక్‌ యాసిడ్‌, రెండుచెంచాల లిక్విడ్‌ డిష్‌వాషర్‌ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాత ఐస్‌ ట్రేలో వేసి ఆరనివ్వాలి. గట్టిగా అయ్యాక వీటిని స్నానాల గదిలో ఓ మూల పెట్టండి. దుర్వాసనల్ని పీల్చుకుంటుంది.

* మరిగే నీళ్లలో కప్పు గులాబీ రేకలు వేయండి. చెంచా యూకలిప్టస్‌ ఆయిల్‌ కూడా చేర్చాలి. ఆ సువాసన ఇల్లంతా వ్యాపించి సువాసనలు వెదజల్లుతుంది.


* లీటరు నీటిలో రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె కలిపి ఇల్లంతా స్ప్రే చేయాలి. దుర్వాసన మాయమవుతుంది. దోమలు రావు.


* బేకింగ్‌ సోడాలో చెంచా వెనిగర్‌, రెండు చుక్కల లావెండర్‌ నూనె కలిపి ఉండల్లా చేయాలి. వీటిని గది మూలల్లో చిన్న కాగితాల్లో వేసి పెడితే దుర్వాసనల్ని పీల్చుకుని పరిమళాన్ని వెదజల్లుతాయి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని