అందమైన ‘చిట్టి’ వాషింగ్‌ మెషిన్‌!
close
Published : 10/05/2021 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందమైన ‘చిట్టి’ వాషింగ్‌ మెషిన్‌!

దుస్తులను ఉతకడానికి వాషింగ్‌ మెషిన్‌ను వాడతాం. అలానే మేకప్‌ కిట్‌ను శుభ్రం చేయడానికి ఓ చిన్నపాటి మెషిన్‌ ఉంటే ఎలా ఉంటుంది?
* మేకప్‌ స్పాంజ్‌ వాషింగ్‌ మెషిన్‌ అని పిలుచుకునే ఈ యంత్రంలో కాస్మెటిక్‌ స్పాంజ్‌లు, పౌడర్‌ పఫ్స్‌, బ్రష్‌లు, బ్లెండర్‌లు, చిన్న బొమ్మలు... అన్నింటినీ శుభ్రం చేయొచ్చు. కేవలం మురికి, మేకప్‌ అవశేషాలు మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, నూనెలు, మృతచర్మం.. లాంటివన్నీ తొలగిపోతాయి.
*  బ్యాటరీతో నడిచే దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు.
* ఈ మెషిన్‌లో నీళ్లు పోసి, కాస్తంత లిక్విడ్‌ సోప్‌ వేయాలి. ఇప్పుడు బ్లెండర్‌ వేసి మూత పెట్టి బటన్‌ నొక్కాలి. కాసేపటి తర్వాత తీస్తే మురికంతా తొలగిపోయి బ్లెండర్‌ శుభ్రపడుతుంది. చక్కనైన ఈ వాషింగ్‌ మెషిన్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని