జుట్టు ఊడుతోందా..
close
Published : 10/05/2021 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జుట్టు ఊడుతోందా..

జుట్టు ఊడటానికి కారణాలెన్నో. మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా ఇలా జరగొచ్చు. అవేంటో తెలుసుకుందామా...

శుభ్రత లేకపోవడం...
వేసవిలో జుట్టుకి దుమ్ము, ధూళితోపాటు చెమటపట్టి జిడ్డుగా మారుతుంది. అందుకే ఈ కాలంలో రోజు విడిచి రోజు తలస్నానం చేయాలి. లేదంటే చుండ్రుతోపాటు వెంట్రుకలు రాలే సమస్యా మొదలవుతుంది.

నూనెలూ కారణమే...
కొబ్బరినూనె జుట్టుకు పోషణనిస్తుంది. అయితే దీన్ని కొందరు ఎక్కువ మొత్తంలో వాడుతుంటారు. నిజానికి మన చర్మం సహజంగానే నూనెలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి కాస్తంత నూనెను మాడుకు, వెంట్రుకలకు పెట్టుకున్నా సరిపోతుంది. అంతేకాదు నూనె పట్టించిన గంటలోపు తలను షాంపూతో కడిగేయాలి.

రసాయనాలకు చెక్‌...
మార్కెట్లో కనిపించే షాంపూలన్నింటినీ వాడతాం. ఇది సరైన పద్ధతి కాదు. వీటిలోని రసాయనాలు జుట్టుకు హాని చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు సహజంగా, గాఢత తక్కువగా ఉండే షాంపూలు, కండిషనర్‌లను ఎంచుకోవడమే మేలు.

రంగు పడుద్ది...  
రంగు వేసుకునే ముందు ఓసారి నిపుణుల సలహా తీసుకోవాలి. అదేపనిగా జుట్టుకు రంగేసుకునే అలవాటునీ తగ్గించాలి. సహజ పద్ధతుల్లో హెన్నా లాంటి వాటిని ఉపయోగిస్తే మంచిది.

హెయిర్‌ డ్రయ్యర్‌...
దీన్ని తరచూ వినియోగిస్తే జుట్టు పాడై ఊడిపోవడం ఖాయం. జుట్టును సహజ పద్ధతుల్లోనే ఆరబెట్టుకోవడం ఉత్తమం.

ఆహారం, నిద్ర..
ఎక్కువగా కాఫీ, టీలు తీసుకోవద్దు. జుట్టు ఎదగాలంటే సమతుల ఆహారం తప్పనిసరి. రోజూ కనీసం ఏడెనిమిది గంటలు కంటినిండా నిద్రపోవాలి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని