పదే పదే వేడిచేస్తున్నారా?
close
Published : 10/05/2021 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదే పదే వేడిచేస్తున్నారా?

చాలామంది ఆహారపదార్థాల్ని వేడి చేసి తింటుంటారు. అయితే అది మంచిదా? కాదా? తెలుసుకుందాం రండి.
* తాజా కాయకూరల్ని వండినప్పుడే కొన్ని పోషకాలు పోతాయి. వాటిని రెండోసారి వేడి చేస్తే, తిన్నా ప్రయోజనం ఉండదు. అందుకే సరిపడినంత వండుకోవడం మేలు. అలాగే చికెన్‌ బిర్యానీ త్వరగా పాడవుతుంది. కాబట్టి దాన్ని వేడిచేసి తినకూడదు.
* పాలను ఎక్కువసార్లు వేడిచేస్తే వాటిలోని సాల్యుబుల్‌ విటమిన్లతోపాటు పోషకాలు తగ్గుతాయి. అప్పుడు తాగినా వృథానే! కాబట్టి ఎన్ని పాలు అవసరమవుతాయో అన్ని మాత్రమే కాచుకుని తాగాలి.
* కొంతమంది అన్నాన్ని ఫ్రిజ్‌లో పెడతారు. దాన్ని తీసి, అరకొరగా వేడిచేస్తారు. అయితే బియ్యంలో బ్యాక్టీరియా ఉంటుంది. అది వేడిచేసినప్పుడు వృద్ధి చెందుతుంది. కాబట్టి అన్నాన్ని ఎక్కువసేపు వేడిచేయాలి. అదేవిధంగా మాంసాన్ని వేడిచేసేటప్పుడు కూడా ముక్కల మధ్యభాగం వేడేక్కెలా చేయాలి. ఒకసారి ఉడికించిన గుడ్డు రబ్బరులా సాగుతుంటే దాన్ని మళ్లీ వేడిచేయకూడదు.
చివరగా.. ఏ పదార్థాన్నైనా వేడి చేసుకుని తినడం వల్ల ఆరోగ్య  సమస్యలు వస్తాయి. కాబట్టి మితంగా వండుకోవడం ఉత్తమమైన పద్ధతి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని