అనుబంధం ఆనందంగా..!
close
Updated : 12/05/2021 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుబంధం ఆనందంగా..!

ఆనందాల అనుబంధం ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. అయితే ఏ బంధంలో అయినా... గుర్తుంచుకోవాల్సిన కొన్ని సూత్రాలున్నాయి...!

* బలవంతం వద్దు: మనకు నచ్చినట్లే ఉండాలని ఎవరినీ బలవంతం చేయకూడదు. ఎదుటివారి ఆలోచనల్ని, అభిప్రాయాల్ని గౌరవిస్తూనే... వారిని వారిలా అంగీకరించండి. అప్పుడే మీరంటే ఇష్టపడతారు. మీకోసం ప్రాణమిస్తారు.
* మాట్లాడుకోండి: మనసు విప్పి మాట్లాడితేనే... విషయం అర్థమవుతుంది. అలాకాకుండా మీకు మీరే ఊహించుకోవడం, ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకోవడం, అలా జరగనప్పుడు కుంగిపోవడం సరికాదు. ఇలాంటి పద్ధతి ఏ అనుబంధంలో అయినా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది.
* సమయం కేటాయించండి: ఎంత దూరంలో ఉన్నా... కొందరి మధ్య అనుబంధం అన్యోన్యంగా సాగుతుంది. కారణం ఒకరికోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవడమే. ఎదుటి వారు బాధల్ని, సంతోషాల్ని పంచుకోవడానికి కొద్ది సమయం అయినా ఇవ్వండి. అది వారికి మీపై నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది.
* మార్పుని అంగీకరించండి: కాలం, అవసరాలను బట్టి వ్యక్తుల్లో మార్పు సహజం. దాన్ని గుర్తించండి. ఆరోగ్యకరమైన బంధం కొనసాగాలంటే... ఇద్దరూ అందు కోసం ప్రయత్నించాలి. సమస్యలు వచ్చినప్పుడు నిజాయతీగా మీ పొరబాటుని ఒప్పుకోవడానికి వెనుకాడవద్దు. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు, హాని జరుగుతున్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికీ ఆలోచించనక్కర్లేదు. ఏదైనా పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలి.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని