పాటతోతోడు!
close
Published : 12/05/2021 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాటతోతోడు!

అదొక ఆసుపత్రి. కొవిడ్‌ రోగులను ఉంచిన ఐసీయూకు బయట నుంచొని ఉందొక నర్సు. తనతోపాటు తెచ్చిన గిటార్‌ను సవరించి, నెమ్మదిగా పాడటం మొదలుపెట్టింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అక్కడి రోగులకు సాంత్వన కలిగిస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపేలా సాగిన ఆ పాట వారందరికీ ఉపశమనాన్ని అందించింది. గిటార్‌పై మృదువుగా సంగీతాన్ని పలికించిన ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో  చూసి లక్షలాదిమంది అభినందనలు అందించారు. ఇంతకీ ఆమె ఎవరంటే... కెనడాలోని ఒటావా ఆసుపత్రిలో నర్సు ఎమీ లిన్‌. ఈమె తనకిష్టమైన సంగీతాన్ని వినిపించి ఇలా అందరి హృదయాలనూ గెలుచుకుంది.

ఒంటరివి కాదు... అంటూ

ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరి కాదు, అందరికీ అందరూ ఒకరికొకరు తోడు అంటూ పాట ద్వారా రోగుల్లో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నించా అంటుంది ఎమీలిన్‌. ఒటావో ఆసుపత్రిలో ఎండోస్కోపీ నర్సుగా పనిచేసేదీమె. ఇటీవల ఐసీయూ విభాగంలో నియమితురాలైంది. దీంతో రోజూ అక్కడ చికిత్సపొందుతున్న వారి వేదనను అతి దగ్గర నుంచి చూసిందీమె. అనారోగ్యంతో కొందరు కుటుంబసభ్యులకు దూరంగా ఉంటే, మరికొందరు ఒంటరిగా జీవితాలను ముగిస్తున్నారు. ఈ సంఘటనలన్నీ వారిలో ఒంటరితనాన్ని నింపుతున్నాయని చెబుతుందీమె. ‘ఎంతో వేదనకు గురవుతున్న వీరిలో ఒంటరివాళ్లు కాదనే భావన తీసుకురావాలనుకున్నా. వారిలో నా పాటతో మనోధైర్యాన్ని నింపాలనుకున్నా. చికిత్స, మేమిచ్చే కౌన్సిలింగ్‌, ఓదార్పుతోపాటు నేను పాడిన పాట ఇప్పుడు అందరికీ కాస్తంతైనా ఆహ్లాదాన్ని ఇచ్చింది. కాసేపైనా వారిలో వేదన దూరమైంది. నర్సు అంటే మందులు అందించడం, చికిత్సల్లో పాలు పంచుకోవడమే అనే భావం నుంచి బయటపడ్డా. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న సంగీతాన్ని నా వృత్తిలో భాగం చేసుకోగలిగినందుకు చాలా తృప్తిగా ఉంది. అందరూ ఇప్పుడు నన్ను ‘సింగింగ్‌ నర్సు’గా పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని అంటున్న ఈ గిటార్‌ నర్సు ఎమీ సంగీత కళాకారిణే కాదు, గీత రచయిత్రి కూడా.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని