ఒత్తయిన కనుబొమలకు... ఆలివ్‌ నూనె!
close
Published : 12/05/2021 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒత్తయిన కనుబొమలకు... ఆలివ్‌ నూనె!

కనుబొమలు చక్కటి ఆకృతిలో ఒంపు తిరిగి ఉంటే కళ్లతో పాటు మోమూ మెరిసిపోతుంది. అవి కాస్త పలచగా ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి.

రోజూ రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల ఆముదాన్ని కనుబొమలకు రాసి మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు కనుబొమలకు తగిన పోషణ అందిస్తాయి. ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

ఆలివ్‌నూనెలో విటమిన్‌ - ఎ, ఇ శిరోజాల ఎదుగుదలకు తోడ్పడతాయి. రెండు చుక్కల ఆలివ్‌ నూనెను కనుబొమలపై మర్దన చేసి బాగా ఆరిన తరువాత శుభ్రపరచుకోవాలి.
* కొబ్బరి నూనె: ఇది కండిషనర్‌లానే కాకుండా మాయిశ్చరైజర్‌లానూ పని చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ ఇ, ఇనుము వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయి. కాస్త గోరువెచ్చటి నూనెతో మర్దన చేస్తే రక్తప్రసరణ సక్రమంగా జరిగి... వెంట్రుకల ఎదుగుదల బాగుంటుంది.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని