ఒక్కోసారి ఏడుపొస్తోంది!
close
Published : 12/05/2021 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కోసారి ఏడుపొస్తోంది!

నా వయసు నలభై. ప్రముఖ సంస్థలో ఉన్నతోద్యోగం. ఆఫీసు, ఇల్లు.. రెండు చోట్లా పని ఎక్కువే ఉంటుంది. పని ఒత్తిడి భరించలేక ఇంట్లో అందరిమీదా అరుస్తున్నాను. ఒక్కోసారి ఏడుపు కూడా వస్తోంది. నిగ్రహం కోల్పోకుండా ఉండేదెలా?

- ఓ సోదరి, ముంబయి

నలభయ్యేళ్లు వచ్చేసరికి శారీరకంగా, మానసికంగా మార్పులొచ్చి ఓర్పు, సహనం తగ్గుతాయి. ప్రీమెనోపాజల్‌ దశలో హార్మోన్లలో వచ్చే మార్పులతో ఓపిక తగ్గి అసహనం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక కారణాలు, పిల్లల ఆలోచనలు కూడా ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరిగితే అవతలి వారిలో  అంచనాలు పెరిగి ఒత్తిడి కలుగుతుంది. అలాగే పనిలో పర్‌ఫెక్షన్‌ కోరుకునే వ్యక్తిత్వంతో ఒత్తిడికి గురవుతారు. బయట చూపలేని కోపాలు ఇంట్లో చూపిస్తారు. చేతకానితనంతో ఇలా చేస్తున్నాననే పశ్చాత్తాపంతో దుఃఖం కలుగుతుంది. దీన్ని అడ్జెస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ అంటారు. సర్దుకోలేక పోవడంవల్ల ఇలా జరుగుతుంది. క్రమంగా మతిమరుపు, నీరసం, నిరాసక్తత కూడా వస్తాయి. కనుక మీరు కొంత విశ్రాంతి తీసుకుని.. ఇల్లా, ఆఫీసా, ఆరోగ్యమా ఏ విషయాలు ఎక్కువ ఒత్తిడి కలిగిస్తున్నాయన్నది గమనించాలి. ఇంట్లో పనులు కొన్ని పిల్లలకు, భర్తకు పంచినట్లయితే మీకు ఒత్తిడి తగ్గుతుంది. వాళ్లు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఆఫీసులో కొన్ని పనులు సహోద్యోగులకు అప్పజెప్పడం లేదా పైవాళ్లతో మాట్లాడి బాధ్యతల్ని మార్చుకోవడమో చేయొచ్చు. సమస్య ఏంటనేది తెలుసుకుని, పరిష్కరించుకోవాలి. రెండోది నిరంతరం పనిచేస్తే అలసిపోతారు కనుక మీకంటూ కొంత సమయం కేటాయించుకుని ఒత్తిడి నుంచి బయటపడండి. అందుకోసం పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాటలు పాడుకోవడం... ఇలా నచ్చినవి చేయాలి. రోజూ యోగా, మెడిటేషన్‌, వాకింగ్‌ లాంటివి ప్రయత్నించండి. పోషకాహారం తీసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుని బాధపెడుతున్న వాటిని రిలాక్సేషన్‌ టెక్నిక్‌తో తగ్గించుకోవాలి. మీకు ఇష్టమైన వ్యక్తులతో వారానికి ఒక్క సారైనా కాసేపు మాట్లాడితే ఆందోళన తగ్గుతుంది.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని