తినిపించండిలా...
close
Published : 12/05/2021 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తినిపించండిలా...

పసిపిల్లలకి అన్నం తినిపించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాళ్లకు తినిపించేందుకు వాడే వస్తువుల విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం రండి..

పిల్లలకు స్పూన్లు అలవాటుంటే పదును తేలినవి కాకుండా.. నునుపుగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. వాటిని ముందుగా వేడి నీటితో కడగాలి.
* వేడి పదార్థాలైతే వాళ్లు తినగలిగి నంత ఉష్ణోగ్రతలో ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. ఆ తర్వాతే పెట్టాలి.
* కొన్ని పదార్థాల్ని మింగలేక పిల్లలు ఇబ్బంది పడతారు. ఒక్కోసారి మెత్తటి పదార్థాలు కూడా తినే పద్ధతిలో తినకపోతే గొంతులో అడ్డు పడొచ్చు. అవన్నీ వాళ్ల ముఖకవళికల్ని బట్టి గమనిస్తూ ఉండాలి.
* ఆరునెలలు వచ్చిన పిల్లలు నిటారుగా కూర్చోడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వెనుక భాగం బాగా ఎత్తుగా ఉండే కుర్చీలో కూర్చోబెట్టి తినిపించండి. అప్పుడు వాళ్లకు ఇబ్బంది ఉండదు.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని