ఆందోళన తగ్గించే అరోమా థెరపీ
close
Updated : 29/05/2021 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆందోళన తగ్గించే అరోమా థెరపీ

రోగం కంటే ఆందోళన మరింత ప్రమాదమని, దాన్ని తగ్గించుకోమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకు తరుణోపాయంగా అరోమా థెరపీని సూచిస్తున్నారు. ఇంతకీ సుగంధ చికిత్స ఎలా మేలు చేస్తుందో, ఉపశమనం కలిగిస్తుందో చూడండి...

మంచి సంగీతంలా సుగంధం ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ ఇస్తుంది. సుమధుర పరిమళాలు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ప్రశాంతత చేకూరుస్తాయి. అలసట పోగొట్టి హాయిగా ఉండేలా చేస్తాయి. ఇది సాధారణ సంగతి. భిన్న పరిమళాలు విభిన్న ప్రభావాలను చూపుతాయి. సుగంధ చికిత్సలో ఆయా పరిమళాల ప్రత్యేకత ఇదీ...

మల్లె, సంపెంగ: కోపావేశాలను తగ్గిస్తాయి. ప్రసన్నత, వినయం లాంటి సుగుణాలను పెంచుతాయి.
దాల్చినచెక్క, గులాబి: రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

వామాకు, సాంబ్రాణి: ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
లావెండర్‌, నిమ్మ, కమలా: అనవసర ఆలోచనలను నివారించి పాజిటివ్‌గా ఉండేట్లు చేస్తాయి. పరిస్థితులను సమన్వయం చేసుకోవడానికి దోహదం చేస్తాయి. డిప్రెషన్‌ను తగ్గిస్తాయి.

గన్నేరు, పుదీన: మెదడును ఉత్తేజపరిచి, చురుగ్గా ఉండేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
మరువం: బాధను పోగొట్టి సేదతీరుస్తాయి.

చేమంతి, గంధం, లవంగాలు: ఒత్తిడిని, టెన్షన్‌ను, నిద్రలేమిని తగ్గిస్తాయి.
ఈ గంధాలను బాడీ స్ప్రేగా లేదా రూమ్‌ స్ప్రేగా వాడవచ్చు. ఈ పరిమళాలున్న అగరొత్తులు లేదా కొవ్వొత్తులను వెలిగించ వచ్చు. నూనెలతో మర్దనా చేయవచ్చు. నీళ్లలో వేసి ఆవిరి పట్టవచ్చు. స్నానం నీళ్లలో వేయవచ్చు లేదా డిఫ్యూజర్లలో ప్రయోగించవచ్చు.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని