కొవిడ్‌లో ప్రెగ్నెన్సీ... శిశువుకిప్రమాదమా?
close
Updated : 29/05/2021 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌లో ప్రెగ్నెన్సీ... శిశువుకిప్రమాదమా?

నాకు ఈ మధ్యే కొవిడ్‌ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ అయిదు రోజుల కోర్సు వాడాను. డోలో, డాక్సీ ఐవెర్‌మెసిటిన్‌, జింక్‌ కోల్డ్‌ మాత్రలు వేసుకున్నా. కోలుకునేసరికి నెలతప్పానని తెలిసింది. నేను వాడిన మందులు ఏమైనా ప్రతికూల ప్రభావం చూపుతాయా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

- ఓ సోదరి, ఒంగోలు

మీకు చివరిసారిగా నెలసరి వచ్చిన తేదీని (మొదటి రోజు) రాసి ఉంటే ఈ మందుల వాడకం వల్ల గర్భస్థ శిశువు మీద ప్రభావం ఉంటుందో లేదో చెప్పడం తేలికయ్యేది. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో కొన్ని రకాల మందులు శిశువు అవయవాల నిర్మాణం (ఆర్గానోజెనిసిస్‌) పై ప్రభావం చూపుతాయి. నాలుగు నుంచి తొమ్మిది వారాల గర్భస్థ పిండంపై ఈ మందులు ప్రభావం చూపుతాయి. మీరు రాసిన మందుల్లో డోలో-650 ఒకటి. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కానీ టెట్రాసైక్లిన్‌ గ్రూపునకు చెందిన డాక్సీసైక్లిన్‌ అనే మందును గర్భవతులు మొదటి మూడు నెలల్లో తీసుకుంటే పిండంలో ఎముకలు, దంతాలు, కండరాల తయారీ, నిర్మాణంలో లోపాలు ఏర్పడతాయి. అలాగే ఐవర్‌మెక్టిన్‌ కూడా గర్భిణులకు నూటికి నూరు శాతం సురక్షితమైందని చెప్పలేం. ఎందుకంటే దానివల్ల కూడా పిండంపై దుష్ప్రభావాలు పడొచ్చు. అందుకని మీరు ఈ మందులను ఏ వారాల్లో వాడారో మీ గైనకాలజిస్ట్‌కు చెబితే తగిన సలహా ఇస్తారు.
కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా పిండానికి సమస్యలు రావొచ్చు. మీకు సమస్య ఎంత ఎక్కువగా ఉంది? ఏ సమయంలో వచ్చింది? వైరల్‌ లోడ్‌ ఎంత ఉంది? మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించింది? కేవలం లక్షణాలే కనిపించాయా లేదా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలూ తీవ్రమైన ప్రభావానికి గురయ్యాయా.. ఆక్సిజన్‌ అవసరమయ్యేంత తీవ్రంగా వచ్చిందా... ఈ విషయాలన్నింటిపై ఆధారపడి ఉండొచ్చు. మొదటి మూడు నెలల్లో తీవ్రమైన జ్వరం, ఆక్సిజన్‌ స్థాయులు బాగా తగ్గిపోయి ఉంటే అవి పిండం ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని