పిల్లలకు ఆకలిబాధ లేకుండా...
close
Updated : 27/03/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలకు ఆకలిబాధ లేకుండా...

రోనా కారణంగా మూతబడిన పాఠశాలల్లోని చిన్నారుల ఆకలి గురించి ఆలోచించింది హాలీవుడ్‌ నటి ఏంజెలినాజోలీ. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసిన నేపథ్యంలో.. మధ్యాహ్నభోజన పథకంద్వారా లబ్ధి పొందే విద్యార్థులు ఆకలితో ఉండకూడదని ఆలోచించిందీ 44 ఏళ్ల అందాలనటి. ఇందుకోసం ఏడున్నర కోట్ల రూపాయలను ‘నో కిడ్‌ హంగ్రీ’ అనే సామాజిక సేవాసంస్థకు అందించింది. బడులకు సెలవులు ప్రకటించడంతో ఇంటి వద్దకే వెళ్లి ఆ చిన్నారుల కుటుంబాలకు తగిన విధంగా చేయూతనందిస్తాం అంటోంది ఏంజెలినా. ‘పాఠశాలలు మూసివేయడంతో.. ఒక్క అమెరికాలోనే రెండు కోట్ల మందికిపైగా విద్యార్థులు భోజనానికి దూరమయ్యారు. వీరందరి ఆకలి తీర్చే దిశగా ‘నో కిడ్‌ హంగ్రీ’ కృషి చేస్తోంది. ఈ సంస్థకు అందరం కలిసి చేయూతనందిస్తే మరెన్నో కోట్లమంది చిన్నారుల వద్దకు ఆహారాన్ని చేర్చి, వారి ఆకలి తీర్చగలం’ అని చెబుతున్న ఏంజెలినా... ఇప్పటికే యూఎన్‌ రెఫ్యూజీ ఏజెన్సీతో కలిసి అఫ్గానిస్థాన్‌, కంబోడియా, కెన్యా, నమీబియాలోని పలు పాఠశాలలకూ ఆర్థిక సాయం అందించింది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని