పట్టు చుట్టండి
close
Updated : 13/12/2019 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్టు చుట్టండి

పండగైనా... వేడుకైనా పడతుల హృదయాలను దోచుకునే వాటిలో పట్టుచీరలు ముందుంటాయి. వాటిల్లో కంచి, బెనారస్‌ పట్టుచీరలు మరింత ప్రత్యేకం. బంగారు, వెండి జరీల పనితనం, పెద్దపెద్ద అంచులు... భిన్నమైన రంగులతో అతివలను ఆకట్టుకుంటాయి. అలాంటి వస్త్రరాజాలే ఇవి. చూసేయండి మరి..

ఊదా రంగు సన్నటి అంచుపై బంగారు, వెండి జరీతో నేసిన గజరాజులు, మయూరాల మోటిఫ్‌లు వావ్‌ అనిపిస్తాయి. గులాబీ రంగు అంచుపై జరీతో పరచుకున్న ఏనుగులు, నెమళ్లు, చిలకలు, పూల తీగెలు... చీరకు కొత్త కళను తెచ్చిపెట్టాయి.


పెసర రంగు సిల్కు చీరపై పూలు, లతల అందంతోపాటు.. మెరూన్‌ అంచుపై పరుచుకున్న సిల్వర్‌ జరీ పూల తీగలు, తరంగాలు... మగువ మనుసును దోచేస్తాయి.


బంగారు పూలతలతో, పసుపురంగు హంగులతో పెద్దంచున్న ఈ చీర కట్టుకుంటే అదుర్సే.


లైట్‌వెయిట్‌ సిల్కు చీరపై అక్కడక్కడా బంగారు జరీ పైస్లీ బుటాలు, నీలం-గులాబీ మిళితమైన అంచు... చీరకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని