నడక నేర్పించండిలా..
close
Published : 23/02/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నడక నేర్పించండిలా..

బుజ్జాయి మెల్లగా పైకిలేచి... పడిపోకుండా జాగ్రత్తగా నిలబడి... ఒక్కో అడుగూ వేస్తుంటే... తల్లిదండ్రుల ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. చిన్నారి మొదటిసారిగా అడుగు వేసిన ఆ అపురూపమైన దృశ్యాలను ఫోన్లలో బంధిస్తారు. ఇది దాదాపు చాలామంది చేసే పనే. అయితే అంతటితో మీ పని పూర్తయిపోలేదు. ఆ సమయంలోనే చిన్నారులకు మీ అవసరం ఎంతో ఉంటుంది.  మీరేం చేయాలంటే...


నడవడం మొదలుపెడితే...

కాస్త అటూఇటూగా ఏడాదిన్నర వయసున్న పిల్లలు నడవడం మొదలుపెడతారు. నిలబడి కింద పడిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ మెల్లగా అడుగులు వేస్తుంటారు.
మీరేం చేయాలంటే: వాళ్ల చేతులను పట్టుకుని మెల్లగా ముందుకు నడిపించాలి. సాధారణంగా పిల్లలు మడమలను పైకి లేపి నడుస్తుంటారు. అలా కాకుండా పాదం మొత్తం నేల మీద ఆనించి నడిచేలా చేయాలి.


శబ్దాలను గుర్తిస్తారు

ఏడాది వయసు వచ్చేసరికి పాపాయిలు తమ పేరును గుర్తిస్తారు. పేరుతో పిలవగానే స్పందించి, పిలిచినవారి వైపు చూస్తుంటారు. అమ్మా.. నాన్నా అని పలకడం మొదలుపెడతారు.
మీరేం చేయాలంటే: చిన్నారులు మెల్లగా పలకడం మొదలుపెట్టినప్పుడు వాళ్లతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. వారి మాటలను మీరు అనుకరించాలి. వాళ్లు తిరిగి మిమ్మల్ని అనుకరించేలా చేయాలి. మీరు చిన్నచిన్న రైమ్స్‌ పాడటం మొదలుపెట్టాలి.


నేర్చుకోవడం

రెండేళ్లు వచ్చేసరికి బంతిని చేతులతో జాగ్రత్తగా పట్టుకుని విసరడం, కాలితో తన్నడం నేర్చుకుంటారు.
మీరేం చేయాలంటే: బరువులేని పెద్ద బంతిని కొని ఇస్తే వాళ్లు సులువుగా విసరగలుగుతారు. వాళ్లంతట వాళ్లే ఆడుకుంటారని వదిలేయకూడదు. మీరూ ఆ ఆటలో భాగం కావాలి. మీరు బంతిని వేస్తే వాళ్లు తీసుకొస్తారు. వాళ్లు విసిరితే మీరు తీసుకొచ్చి ఇవ్వాలి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని