నాన్నా అక్కడే ఉండు!
close
Published : 28/03/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్నా అక్కడే ఉండు!

చిన్నారి లేఖ

* అమ్మో!! 21రోజలా..! ఏదో ఒక రోజంటే ఎక్కడోచోట ఎలాగోలా ఉండగలం కానీ, మరీ అన్ని రోజులంటే అయ్యే పనేనా.. ఇంట్లో నా భార్య, పిల్లలు ఎలా ఉన్నారో!! ఎలాగైనా ఏదో ఒక బండి చూసుకొని ఉదయమే ఊరెళ్లిపోవాలి.
* నాకేమవుతుందిలే. అయినా ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం. అలా ఫ్రెండ్స్‌తో కాసేపు బయట తిరిగొస్తే పోయేదేముంది. పోలీసులు ఆపితే ఏదో సాకు చెప్పి తప్పించుకోవచ్చులే!!

ఇలా దేశం లాక్‌డౌన్‌లో ఉన్నా.. తమకు అంత అవసరం లేకున్నా.. హాయిగా బయట తిరిగేస్తున్నారు జనం. ఊరెళ్లాలని కొందరు, ఇంట్లో ఉండలేమని ఇంకొందరు, ఇంకెన్నాళ్లని మరికొందరు. ప్రభుత్వం, పోలీసులు ఎంత చెప్తున్నా మాకేం కాదులే అని పట్టీ పట్టనట్లు రోడ్లమీదికొచ్చేస్తున్నారు. కానీ మీరొక్కరు బయటికొస్తే ప్రమాదం కేవలం మీకే కాదు. మీ కుటుంబానికి, సమాజానికి ప్రమాదమే అని తెలుసుకుందో చిన్నారి. ఎక్కడో దూరంగా ఉన్న తన నాన్నని ఇంటికి రావొద్దంటూ ఉత్తరం రాస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించే
వీడియోను ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా ‘ఇండియా ఫైట్స్‌ కరోనా’ అనే హ్యాష్‌టాగ్‌తో పంచుకున్నారు. ఆ వీడియోలో ‘నాన్నా! నేను నిన్ను అస్సలు మిస్‌ అవ్వట్లేదు. అమ్మ కూడా. మీరు ముంబై నుంచి మాకోసం పరుగెత్తుకు రావాల్సిన అవసరం లేదు. మీరెక్కడున్నారో అక్కడే ఉండండి. మీరు బయటికొస్తే కరోనా గెలుస్తుంది. మనం కరోనాని ఓడించాలి. సరేనా !!’. అంటోంది చిన్నారి వీడియో. మీరూ ఈ లాక్‌డౌన్‌ బయటికెళ్లకుండా ఇంట్లోనే ఉండి దేశాన్ని కాపాడండి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని