శుభ్రత ముద్ర...
close
Published : 04/04/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శుభ్రత ముద్ర...

పిల్లలకు వినేలా చెప్పాలి. అలా చెబితే ఏ పనైనా చేస్తారు. ఈ విషయం షౌనావుడ్స్‌కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో! అమెరికాలో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె... వినూత్న రీతిలో తన విద్యార్థులతో చేతులని శుభ్రంచేయిస్తోంది...

షౌనా విద్యార్థుల నోట్‌బుక్స్‌పై తన పేరుతో ఉండే స్టాంప్‌ను వేసేది. ప్రస్తుతం ఆ స్టాంపుని హోంవర్క్‌ పుస్తకంపై వేయకుండా పిల్లల చేతి మీద వేస్తోంది. ఆ స్టాంప్‌ మరక తొలగిపోయే వరకు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని చెప్పింది. మరక పూర్తిగా తొలగిపోతే వారికి చక్కటి బహుమతి కూడా ఇస్తోంది. దాంతో పిల్లలంతా చేతులు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయాల గురించి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. అది కాస్తా వైరల్‌గా మారింది. ‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ విధానం పాటించి మరింత మంది విద్యార్థులు ఆర్యోగంగా ఉంటారని అనుకుంటున్నా’ అని చెబుతోంది ఈ టీచరమ్మ.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని