వయసుకు మించి మాట్లాడుతుంటే..
close
Published : 06/06/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వయసుకు మించి మాట్లాడుతుంటే..

టీవీలూ, సినిమాల ప్రభావం కొంత, ఇంట్లో పరిస్థితులు ఇంకొంత.. కొందరు చిన్నారులు వయసుకు మించి మాట్లాడేస్తుంటారు. ఈ మాటలు మొదట్లో ముద్దుముద్దుగా అనిపించినా.. కొన్నాళ్ల తర్వాత అసహనం కలిగిస్తాయి. నలుగురిలో పిల్లల ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. దీన్ని నియంత్రించాలంటే.. ఈ సూచనలు పాటించి చూడండి.
పిల్లల్ని కూర్చోబెట్టి ఆటలు ఆడించడం, కథలు చెప్పడం తగ్గించేశాం. దాంతో కాస్త ఖాళీ దొరికినా టీవీకి అతుక్కుపోతున్నారు. టీవీలో వినిపించే మాటలే వాళ్లు ఒంటపట్టించుకుంటున్నారు. దాంతో ఎక్కువగా మాట్లాడేస్తుంటారు. అతిగా ప్రవర్తిస్తుంటారు. పిల్లల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత పెద్దలదే. నియమిత సమయంలోనే టీవీ చూసేలా కట్టడి చేయాలి. వారికి సరైన వ్యాపకం ఉండేలా చూసుకోవాలి. పుస్తకాలు చదివించడం, నీతి కథలు చెప్పడం, మెదడుకు పదునుపెట్టే పజిల్స్‌ చేయించడం.. ఇవన్నీ చిన్నారుల్లో మార్పునకు దోహదం చేస్తాయి.
* వయసుకి మించిన మాటలు పిల్లల్లో మేధస్సుకు గుర్తింపే కావొచ్చు.. కానీ, అవి సున్నితంగా, సానుకూలంగా ఉంటేనే మేలు. అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తించినా, అనవసరమైన పేచీలకు దిగినా.. వారి చురుకుతనం దారి తప్పుతోందని గుర్తించండి. మొదటి నుంచే వాస్తవికతకు, ఊహకు మధ్య తేడాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు వారి  ప్రవర్తన వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది.
* పిల్లలు మాట్లాడేటప్పుడు తప్పొప్పులను ఎప్పటికప్పుడు సరిచేయడం మంచిది. అలానే పెద్దల మాటలను పిల్లలు అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే వారి ముందు అనవసర పద ప్రయోగాలు, వ్యాఖ్యలు చేయొద్దు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని