అందాన్ని పెంచే కొత్తిమీర
close
Published : 14/03/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందాన్ని పెంచే కొత్తిమీర

వంటకు మరింత రుచి పెరగాలంటే చివరగా గుప్పెడు కొత్త్తిమీర వేస్తాం. అలా కూర రుచిని పెంచే కొత్తిమీర మన చర్మాన్నీ తాజాగా మార్చి ఆరోగ్యంగా చేయగలదు అంటున్నారు చర్మసౌందర్య నిపుణులు. ప్రస్తుతం సహజసిద్ధంగా తయారుచేసే లోషన్స్‌, క్రీమ్స్‌, షాంపూల తయారీలో కూడా దీన్ని విరివిగా వినియోగిస్తున్నారు. అందానికి కొత్తిమీరను ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం.

పాలు, తేనెతో... ఫోలేట్‌, విటమిన్‌-సి, ఐరన్‌, బీటా కెరొటిన్‌, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే కొత్తిమీర అందాన్ని పెంచడంలో ముందుంటుంది. రెండు చెంచాల కొత్తిమీర ముద్దకు పావుచెంచా చొప్పున పాలు, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత నీటితో ముఖాన్ని కడిగితే చాలు. చర్మం మెరుపులీనుతుంది.

కలబంద గుజ్జును కలిపి... గుప్పెడు కొత్తిమీర ఆకులను ముద్దగా చేసి చెంచా కలబంద గుజ్జును కలిపి చర్మానికి పట్టించాలి. పావు గంట తర్వాత  గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు చేస్తే ముడతలు, గీతలు తగ్గుతాయి.
నిమ్మరసంతో.. చెంచా నిమ్మరసానికి రెండు చెంచాల ముద్దను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ ఉన్నచోట రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై మృతకణాలు,   మచ్చలను పోతాయి.
బియ్యప్పిండి కలిపి..  పావుకప్పు బియ్యప్పిండిలో చెంచా చొప్పున పెరుగు, నిమ్మరసం, రెండు చెంచాల కొత్తిమీర ముద్దను కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖంలోని కండరాలు, కణాలపై ఒత్తిడి తగ్గి తాజాగా మారుతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని